ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ క్యూట్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – నమ్రతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అన్యోన్యతకు మరో మారుపేరు . చాలామంది సీనియర్ సెలబ్రిటీస్ కూడా మహేష్ నమ్రతలను వైవాహిక జీవితంలో ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు . అందరూ భార్యాభర్తలు లాగే వీళ్లు గొడవపడతారు.
కానీ ఆ గొడవలను చాలా కూల్ గా సాల్వ్ చేసేసుకుంటారు . వెకేషన్స్ కి వెళ్తూ లైఫ్‌ను బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ప్రెసెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ అడ్వెంచరస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ నమ్రతలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .
మొదటి నుంచి మహేష్ బాబు కి టాట్యూ లు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయాని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు మహేష్ . అయితే నమ్రత తన భర్త పై ఉండే ప్రేమతో తన భర్త పేరుని తన చాతి పై టాటూ వేయించుకుందట . ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో మహేష్ బాబు ఆమెపై బాగా కోప్పడ్డారట. కానీ భార్య ప్రేమ తెలుసుకొని ఆ తర్వాత కూల్ అయిపోయారట . మహేష్ అంటే ప్రాణం నమ్రతకి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!!