ఎన్టీఆర్ ..చాలా కోపం ఎక్కువ ..చాలా మంచి మనసు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. నచ్చితే క్లాప్స్ కొడతాడు ..నచ్చకపోతే చంప పగలగొడతాడు . ఈ విషయం ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానికి ఇది బాగా తెలిసిన విషయమే . గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు టైపులో ఇండస్ట్రీని ఏలేస్తున్న హీరో ఎన్టీఆర్.
ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది . ఆయనను హర్ట్ చేశారా..? అంతే కళ్ళు ఉరుముతాడు.. ఆయన కోపం భరించడం చాలా చాలా కష్టం. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ కొంతమంది పని పాట లేక ఆయనకు కోపం తెప్పిస్తుంటారు. గతంలో ఓ హీరోయిన్ తో అఫైర్ అంటగట్టాడు ఎన్టీఆర్కి కొంతమంది జనాలు . ఈ విషయం పట్ల ఎన్టీఆర్ ఫుల్ ఫైర్ అయిపోయాడు. ఎంతలా అంటే తాను తప్పు చేయకపోయినా సరే తప్పు చేశాను అని వార్తలు ప్రచురించడం అప్పట్లో ఆయనకు మండేలా చేసింది .
అంతే అలాంటి నిందలు ఆయనపై వేసుకోకూడదు అని డిసైడ్ అయిన తారక్ ఆ తర్వాత ఆమెతో పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన సరే నో ఆమె సినిమాలో ఉంటే నేను నటించను కావాలంటే నేను సినిమా నుంచి తప్పుకుంటాను అంటూ తెగేసి చెప్పేసాడట . అయితే మేకర్స్ కు ఎన్టీఆర్ స్వభావం గురించి తెలిసి ఆ హీరోయిన్ కాకుండా వేరే హీరోయిన్ ని పెట్టి సినిమాలు కంటిన్యూ చేశారు . అలాంటి ఓ మొండి నిజాయితీగల మనస్తత్వం తారక్ కి… ప్రజెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!