Moviesబన్నీ కోసం అలాంటి త్యాగం చేసిన ఎన్టీఆర్ ..అందుకే అంత బెస్ట్...

బన్నీ కోసం అలాంటి త్యాగం చేసిన ఎన్టీఆర్ ..అందుకే అంత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు . పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు . కానీ అందరికీ చాలా డిఫరెంట్ గా అనిపించే ఫ్రెండ్షిప్ బన్నీ – తారక్ స్నేహమే . ముద్దుగా బావ బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు . టఫ్ గా సినిమాల విషయంలో కాంపిటీషన్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ అదంతా చాలా హెల్తీగానే జరుగుతూ ఉంటుంది .

నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు . ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ తో ఉన్న స్పెషల్ సంబంధం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అల్లు అర్జున్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ వద్దకు వచ్చిన మంచి మంచి కథలను ఆయన బాడీకి సూట్ అవ్వని ఎన్టీఆర్ కి సూట్ అయ్యే కథలను స్వయంగా డైరెక్టర్స్ కు బన్నీ ప్రమోట్ చేస్తారట.

ఈ సినిమా ఎన్టీఆర్కి బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తారట . అదే విధంగా ఎన్టీఆర్ సైతం ఎన్నో సినిమాలను బన్నీ కోసం త్యాగం చేశాడట . బన్నీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన బోలెడు సినిమాల విషయాలలో ఎన్టీఆర్ స్పెషల్ గా కేర్ తీసుకున్నారు అని .. ఆ కారణంగానే వీళ్లు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు అని సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది..!!

వీళ్ళిద్దరి కాంబోలో మల్టీ స్టార్ రావాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే అలాంటి దమ్మున్న డైరెక్టర్ ఎప్పుడు ఆ కధ ని రెడీ చేస్తాడో..? చూద్దాం .. ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉంటే ..అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఇద్దరూ కూడా కచ్చితంగా తమ సినిమాలతో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకునే విధంగానే ఉన్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news