ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . అయితే టూ రొమాంటిక్ లేదంటే .. టూ బోరింగ్ . అంతేకానీ మెసేజ్ ఓరియంటెడ్ .. మన చరిత్ర గురించి తెలిపే సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ లు చాలా రేర్ గా కనిపిస్తున్నారు. రీసెంట్గా అలాంటి ఓ సినిమాలు తెరకెక్కించి సంచలనానికి తెరలేపారు యాట సత్యనారాయణ. టాలెంటెడ్ నటులు ఇంద్రజ ,బాబీ సింహ, అనసూయ , రాజ్ అర్జున్, పాండే , వేదిక , ప్రేమ, జాన్ విజయ్ , మహేష్ తేజ్ , సుప్ర తదితరులు కీలకపాత్రలో నటించిన సినిమా రజాకర్ .
యాట సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గూడూరు నారాయణరెడ్డి ఎంతో ఇష్టంగా నిర్మించారు . సమీర్ వీర్ క్రియేషన్స్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎడిటింగ్ తమ్మి రాజు చేశారు . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా రాలేదు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు జనాలు .
రజాకర్ సినిమా ఏడో నిజాం హయాంలో ఖాసిం రాజ్వీ సృష్టించిన రజాకర్ల ఆగడాలను ప్రధానంగా చేసుకొని రూపొందించారు. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రాంతంలో ఖాసిం రాజ్వి నాయకత్వంలోని రజాకర్లు ఎంతగానో దారుణాలకు తెగబడ్డారు అని మహిళలను వివస్త్రలను చేసి హింసించారు అని.. మూగ జీవులని అతి కిరాతకంగా చంపారు అని .. ఈ సినిమా చెబుతుంది . పసిపిల్లలను కూడా వదలకుండా ఆడబిడ్డలను దారుణంగా హింసించారు అని .. ఇష్టారాజ్యంగా వ్యవహరించి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలను తమ బానిసలుగా మార్చేశారు అంటూ ఈ సినిమా చెప్తుంది.
సినిమా మొత్తానికి హైలైట్ అనసూయ నటననే అని చెప్పాలి . అంతేకాదు తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . సినిమాల్లో ఎక్కడ కల్పితాలు అనేటివి లేవు .. ఉన్నది ఉన్నట్లు చూపించాడు అంటున్నారు సినిమా చూసిన జనాలు. ఓవరాల్ గా ఓకే. అయితే నేటి యువతకి ఈ సినిమా నచ్చుతుంది అన్న గ్యారెంటీ లేదు.. రొమాంటిక్ సీన్స్ లవ్ స్టోరీస్ పంచ్ డైలాగ్స్ బూత్ డైలాగ్స్.. ఉంటేనే యువతకు నచ్చుతుంది.. మరి అలాంటి యువతకు ఇలాంటి ఓ చరిత్ర గుర్తుచేసే సినిమా నచ్చుతుంది అని పూర్తిగా చెప్పలేదు. అందుకే నేటి యం జనరేషన్ ఈ సినిమా చూడాలి అంటే కండిషన్ లు అప్లై.. నో రొమాంటిక్ సీన్స్.. వల్గర్ డైలాగ్స్ ఓన్లీ రియలిస్టిక్ సీన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి ఫస్ట్ డే రజాకర్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..??