Movies"లంబసింగి" మూవీ రివ్యూ: దివి హిట్.. స్టోరీ ఫట్.. జస్ట్ ఏ...

“లంబసింగి” మూవీ రివ్యూ: దివి హిట్.. స్టోరీ ఫట్.. జస్ట్ ఏ టైం పాస్ మూవీ..!!

బిగ్బాస్ ఫేమ్ దివి హీరోయిన్గా నటించిన మొట్టమొదటి సినిమా లంబసింగి . ఈ సినిమా కోసం దివి ఎంత కష్టపడిందో.. ప్రమోషన్స్ లో క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. కాగా చాలా సింపుల్ స్టోరీ తో చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు రిలీజ్ అయింది . ఈ సినిమా చూసిన జనాలు తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. అయితే కొంతమంది సినిమా సూపర్ గా ఉంది అంటుంటే మరి కొంతమంది యావరేజ్ అని మరి కొంతమంది బోరింగ్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు . అసలు లంబసింగి చిత్రం ఎలా ఉంది ..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

“లంబసింగి” అనే ప్రాంతం లో పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారిలో కొందరు నక్సల్స్ పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు . కానీ రెగ్యులర్గా అయితే పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఎస్పీ ఒక రూల్ కూడా పెడతారు . సీన్ కట్ చేస్తే వీరబాబు కొత్తగా అదే పోలీస్ స్టేషన్ లోకి కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరుతాడు. అయితే ఆయన వస్తూ వస్తూనే సంతలో అందమైన అమ్మాయిని చూస్తాడు . అక్కడే పడిపోతాడు . ఆమెనే పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయిపోతాడు.

పోలీస్ ఉద్యోగం చేస్తూనే ఎప్పుడు ఆమె ధ్యాసలో ఉంటాడు . అసలు సిసలైన లవ్ స్టోరీ ఇక్కడే మొదలవుతుంది . ఓ రోజు సంతకం కోసం మాజీ నక్సల్స్ ఇంటికి వెళ్ళగా అక్కడ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు హరిత. నక్సల్ కూతురు అని తెలుసుకొని షాక్ అయిపోతాడు. కానీ ఆమె నర్స్ పనిచేస్తుందని తెలిసి ఆనందపడతాడు . వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్సివ్ గా ఉంటుంది .

మరి ముఖ్యంగా లంబసింగి లొకేషన్స్ ని చాలా చక్కగా చూపిస్తాడు డైరెక్టర్. సీన్ కట్ చేస్తే ఓ రిసార్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేని నక్సల్స్ మందు పాత్ర పెట్టి చంపేస్తారు . అది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ గా మారడంతో పోలీసులకు చాలా చాలా తలనొప్పులు క్రియేట్ చేస్తుంది . ఈ ఘటనకు కారకులైన వారిని ఆరాధిస్తే కోనప్ప అని తెలుస్తుంది . అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే మలుపు తిరుగుతుంది . ఓ రోజు నక్సెల్స్ పోలిస్టెషన్ పై దాడి చేస్తారు . తుపాకులు ఎత్తుకెళ్లి పోతారు .

ఆ సమయంలో అక్కడ వీరబాబుల డ్యూటీ చేస్తాడు కానీ ఏమి చేయలేకపోతాడు . ఆ సమయంలోనే ఓ షాకింగ్ విషయం వీరబాబు చూస్తాడు . ఆయన చూసిన విషయం ఏంటి ..? అసలు కోనప్ప నిజంగానే నక్సల్ గా ఎలా మారాడు..? హరిత బ్యాగ్రౌండ్ ఏంటి..? వీరబాబు హరిత మధ్యలో లవ్ స్టోరీ లాస్ట్ కి ఏమైంది ..? అని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇలాంటి స్టోరీలు ఇదివరకు చాలానే వచ్చాయి.

కానీ అక్కడక్కడ మసాల దట్టించి.. తనదైన స్టైల్ లో సీన్స్ తెరకెక్కించి నేచర్ లవర్ అని అనిపించుకున్నాడు డైరెక్టర్ . సినిమా మొత్తానికి ఓకే.. యావరేజ్ ఒకసారి చూడొచ్చు అయితే పదేపదే సినిమాలో చూసే అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఏమీ లేవు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . అంతేకాదు దర్శకుడు నవీన్ గాంధీ తన రాసుకున్న కథను జనాలకు తెలియజేయడంలో ఫ్లాప్ అయ్యాడు అంటున్నారు కొందరు ఫ్యాన్స్. దివి నటన మాత్రం సూపర్ గా ఉంది అని హీరోయిన్గా భవిష్యత్తులో చాలా చాలా మంచి పొజిషన్ చేరుకుంటుంది అంటూ రివ్యూలు ఇస్తున్నారు . చూద్దా, మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news