సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం చాలా చాలా కామన్ గా మారిపోయింది. ఒకప్పటి పరిస్థితి వేరు.. కనీసం నాలుగు అయిదు ఏలైనా కలిసి కాపురం చేసుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది . పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసేసుకుంటున్నారు . సినీ స్టార్ సెలబ్రెటీస్ మరి ముఖ్యంగా ఈ లిస్టులో బడా స్టార్ సెలబ్రిటీల పిల్లలే ఉంటూ ఉండడం గమనార్హం . నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే .
వీళ్ళు పెళ్లి తర్వాత పట్టుమంటే ఆరు నెలలు కలిసి ఉంటారు . ఆ తర్వాత ఇద్దరు దూరం దూరంగానే ఉన్నారు . వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏంటో ఎవరికీ తెలియదు . కానీ నిహారిక చైతన్య మాత్రం చాలా దూరంగా ఉంటూ ఉండడం అభిమానులకి నచ్చలేదు . సంసారం అన్నాక గొడవలు సర్దుకుపోవాలి అంటూ చాలా సార్లు నిహారికకు సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ సర్ది చెప్పారు . కానీ నిహారిక ఏదో విషయానికి డీప్ గా హార్ట్ అయింది.
అందుకే విడాకులు తీసుకుంది . అయితే పెళ్లికి ముందే వీళ్ళ జాతకం చూపించినప్పుడు.. ఇద్దరు జాతకాలలో దోషం ఉంది అని .. పరిహార శాంతి పూజలు చేయించాలి అని నాగబాబుకి చెప్పారట . కానీ మొదటి నుంచి పూజలు పునస్కారాలు పెద్దగా నమ్మని నిహారిక.. ఆ విషయాన్ని లైట్‌గా తీసుకుందట. ఆ తర్వాత పెళ్లిలో కూడా వీళ్ళ పేరు మీద ముహూర్తం దాటిపోయిన తర్వాత ఫోటోషూట్స్ అంటూ టైం వేస్ట్.. చేసిన తర్వాతే చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశారట . వీళ్లువిడాకులు తీసుకోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఏది ఏమైనా సరే అంతా అయిపోయింది.. నిహారిక చైతన్యలు ఇక జన్మలో కలవరు అది అందరికీ తెలిసిన విషయమే..!!