మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇప్పుడు ఓ రారాజు మెగాస్టార్ తర్వాత అలాంటి ఓ స్థానాన్ని అందుకోబోతున్న హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .
అయితే గతంలో సురేఖ .. చరణ్ కి వార్నింగ్ ఇచ్చింది అన్న వార్త నెట్టీంట వైరల్ గా మారింది . చరణ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడట. ఇంగ్లీష్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే . అయితే ఓ రోజు నేను కూడా ఇలాంటి సినిమాల్లో నటిస్తాను మమ్మీ అంటూ తెలిసి తెలియక టంగ్ స్లిప్ అయ్యాడట . దీంతో వెంటనే సురేఖ ఇలాంటి సినిమాల్లో నటిస్తానంటే ఒప్పుకోను ..
తాటతీస్తా .. పద్ధతిగా ఉండే సినిమాలోనే నటించాలి అంటూ మెగాస్టార్ ముందే వార్నింగ్ ఇచ్చిందట. అప్పట్లో మెగాస్టార్ కూడా అది విని నవ్వుకున్నారట . సినిమా ఇండస్ట్రీ అంటే అన్ని పాత్రలు పోషించగలగాలి ..అభిమానులను ఎంటర్టైన్ చేయగలగాలి .. అప్పుడే అసలైన హీరో అవుతాడు అంటూ చెప్పుకు వచ్చారట . సురేఖ చేసిన పనికి ఇప్పటికీ రామ్ చరణ్ మెగాస్టార్ నవ్వుకుంటూనే ఉంటారట..!!