ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో .. కోలీవుడ్ ఇండస్ట్రీలో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ పేర్లు మారు మ్రోగిపోతున్నాయి . ఇన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట త్వరలో విడిపోబోతుంది అన్న ప్రచారం ఊపు అందుకుంది. దానికి కారణం నయనతార – విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేయడమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు .
సరోగసి ద్వారా ఇద్దరి కవల పిల్లలకు తల్లి అయింది నయనతార. చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోతారా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. నయనతార తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఆమె కన్నీళ్ళతో కూడా ఇది నాకు లభించింది అని ఎప్పటికీ చెప్తుంది అని అర్థం వచ్చేలా ఇంగ్లీషులో ఒక కొటేషన్ పెట్టింది . అంతేకాదు భర్త విగ్నేష్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి అన్‌ఫాలో చేసింది.
దీనితో సోషల్ మీడియాలో వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది . అంతేకాదు దీనిపై పలువురు క్లారిటీ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. నయనతార కావాలని అన్‌ఫాలో చేయలేదని .. అదంతా టెక్నికల్ ప్రాబ్లం అని.. ఆమె ఏదో స్టేటస్ పెడితే మరి ఏదో ఊహించుకుంటున్నారు అని .. నయనతార విగ్నేశ్ చాలా బాగా ఉన్నారు అని.. వాలెంటైన్స్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని .. వాళ్ళ మధ్య దయచేసి పుల్లలు పెట్టొద్దు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!