ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతున్నాడా…? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం . ఈ సినిమాని డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్ లో దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . సినిమాలో నానికి జోడిగా ప్రియాంక ఆర్మూల్ మోహన్ నటిస్తుంది .
వివేక ఆత్రేయతో నాని ఆల్రెడీ అంటే సుందరానికి సినిమా చేశాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు . అయినా సరే మరో బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్నాడు ఆత్రేయ. కాగా సరిపోదా శనివారం కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్తిగా ఢిఫరెంట్ కాన్ సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం నాని దాదాపు ఈ సినిమా కోసం 45 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట .
నిజానికి నాని తన ప్రతి సినిమాకి 15 – 20 – 25 కోట్ల వరకే ఛార్క్ చేస్తాడట . కానీ ఈ సినిమా కోసం మాత్రం దాదాపు 45 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట . దసరాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని ఆ తర్వాత హాయ్ నాన్నతో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు. అందుకే తాను కెరియర్లో ఎదగాలి అన్న కారణంగా నాని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారట. టైర్ 2 హీరోలల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో నానినే కావడం గమనార్హం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే కొనసాగితే నాని చరిత్ర సృష్టించడం పక్కా అంటున్నారు జనాలు. నాని ఫ్యాన్స్ మాత్రం ఇక ఒక్కోక్కడికి పులుసు కారిపోవాల్సిందే అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!