ప్రభాస్ నిన్న మొన్నటి వరకు ఇతను కేవలం హీరోనే అనుకున్నారు. తన పని తాను చూసుకో పోయే ఒక తెలుగు హీరో మాత్రమే అనుకున్నారు . కానీ టైం వస్తే తనలోని ఒరిజినాలిటీని బయటపెడతాడు అని రీసెంట్గా బయటపడింది . మనం ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ చూస్తున్నామో తెలిసిందే. సినిమాకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు సినిమా ఫ్లాప్ అయ్యాక పట్టించుకోవడమే మానేస్తున్నారు . అంతేకాదు సినిమా రెమ్యూనరేషన్ వేరు సినిమా కోసం వర్క్ చేసే టైంలో వాళ్ల కుటుంబాలకు ..వాళ్ళ ఫ్రెండ్స్ కు ..షూటింగ్స్ కు వచ్చిన వాళ్లకు అయ్యే ఖర్చులు వేరు . అవన్నీ కూడా నిర్మాతలే భరించాలి .
ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వస్తున్న సాంప్రదాయం . అయితే ఆ సాంప్రదాయానికి బ్రేక్ చెప్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటాడు . కానీ అది పూర్తిగా రెమ్యూనరేషన్. ప్రభాస్ కోసం షూటింగ్ స్పాట్ కి ఎవరైనా వచ్చిన ..ప్రభాస్ బాడీగార్డ్స్ కు.. ప్రభాస్ తో వర్క్ చేసే టీంకు ఆయనే సొంతంగా ఫుడ్ ని ఇంట్లో వండించుకొని తీసుకొస్తారట . అంతేకాదు షూటింగ్ స్పాట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయి కూడా ప్రభాసే భరిస్తాడట . మిగతా ఏ హీరోలు ఇలా చేయరు.
కేవలం ప్రభాస్ మాత్రమే ఇలా చేస్తున్నారు . అసిస్టెంట్ మేకప్ మేన్ జీతాల దగ్గర నుంచి ఆయన కూర్చునే టెంట్ వరకు అన్ని ఆయన సంపాదనతోనే ఆయనే సమకూర్చుకుంటారట . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఒక కొత్త సాంప్రదాయం రావాలి అని అప్పుడే నిర్మాతలు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి బాగుంటుంది అని.. పెద్ద సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ప్రభాస్ ఇకపై అన్ని సినిమాల విషయంలో ఇదే విధంగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారట . దీంతో నిర్మాతల పాలిట దేవుడుగా మారిపోయాడు ప్రభాస్. నువ్వు నిజంగానే రాజువి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు.