లావణ్య త్రిపాఠి ప్రజెంట్ ఈమె పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా గతంలో లావణ్య త్రిపాఠి అంటే చక్కగా ఉంటుంది. అందంగా నటిస్తుంది .. ఎక్స్పోజ్ చేయదు.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనే కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు లావణ్య త్రిపాఠి పేరు చెప్తే మాత్రం మెగా ఇంటి కోడలు అంటూ స్పెషల్ గౌరవాన్ని ఇస్తున్నారు జనాలు . రీసెంట్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తన ఫస్ట్ వెబ్ సిరీస్ ను చేసింది .
మిస్ పర్ఫెక్ట్ అంటూ రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . ఓసిడి క్యారెక్టర్ లో లావణ్య చించేసింది . ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా హోమ్లీ లుక్స్ లో అభిమానులను బాగా ఆకట్టుకునింది . కాగా కోడలు సిరీస్ పై మామ నాగబాబు కూడా పాజిటివ్ గా స్పందించాడు . అందరూ చూడాల్సిన సిరీస్ అంటూ ప్రమోట్ చేశారు. ఇక్కడే మెగా అభిమానులకు కొత్త డౌట్లు వస్తున్నాయి.
జనరల్ గా పెద్దింటి కోడళ్ళు సినిమాలో నటిస్తూ ఉంటే అత్తమామలు ఒప్పుకోరు . కానీ నాగబాబు మాత్రం లావణ్య ను ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు నిజానికి నాగబాబుకి వరుణ్ తాను లావణ్యను ప్రేమిస్తున్నాను అంటూ ముందు చెప్పారట. ఆ తర్వాత మెగా ఫ్యామిలీని ఒప్పించే బాధ్యతలను నాగబాబునే తన భుజాలపై వేసుకున్నాడట . ఇలా వరుణ్ – లావణ్య పెళ్ళికి కర్త కర్మ క్రియ అన్ని నాగబాబు అయ్యారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి మంచి మామ దొరికినందుకు నువ్వు అదృష్టవంతురాలివి అంటూ లావణ్య త్రిపాఠిను పొగిడేస్తున్నారు జనాలు..!!