Moviesహనుమాన్ బ్లెసింగ్స్ తో..బంగారం లాంటి ఆఫర్ పట్టేసిన ప్రశాంత్ వర్మ.. ఇక...

హనుమాన్ బ్లెసింగ్స్ తో..బంగారం లాంటి ఆఫర్ పట్టేసిన ప్రశాంత్ వర్మ.. ఇక రాజమౌళినే మించిపోతాడు పో..!

ప్రశాంత్ వర్మ.. ఈ పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూసాం. అంతకుముందు ఆయన తెరకెక్కించిన సినిమాలు హిట్ అయినా సరే ఇంత రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ పబ్లిసిటీ దక్కించుకోలేకపోయాడు . కానీ సంక్రాంతి కానుకగా ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు . ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సక్సెస్ఫుల్గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది . ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించేసాడు ప్రశాంత్ వర్మ . జై హనుమాన్ అంటూ నామకరణం కూడా చేసేసారు . కాగా ఈ సినిమాలో హనుమంతుని , రాముని పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. కొందరు రామ్ చరణ్ మరికొందరు రానా ..మరికొందరు చిరంజీవి అంటూ తమకు ఇష్టం వచ్చిన విధంగా ఊహించుకుంటున్నారు .

అయితే తాజాగా ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో స్టార్ పాన్ ఇండియా హీరో కన్నడ నటుడు యాష్ నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కేజిఎఫ్ నటుడు యాష్ ను తీసుకోబోతున్నారు అనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది . అయితే దీనిపై ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు స్పందించలేదు . కానీ బ్యాక్ గ్రౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది అని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అన్ని భాషలకు సంబంధించిన స్టార్స్ ను ఈ సినిమాలో పెట్టుకోవాలని చూస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news