సినిమా ఇండస్ట్రీలో సినిమాల కోసం తెగించే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు . బయట ఇండస్ట్రీలో ఏమో కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అలాంటి హీరోలు ఎక్కువ మందే ఉన్నారు. సినిమా కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడే హీరోలు తెలుగు ఇండస్ట్రీలోని ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. వాళ్లలో ఒకరే అల్లు అర్జున్ . అల్లు అర్జున్ సినిమాల కోసం ఏమైనా చేస్తాడు ..ఎంతకైనా తెగిస్తాడు .. ఎంతైనా కష్టపడతాడు ..దానికి దీ ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కోసం ఒళ్ళు హూనమైపోయేలా అల్లు అర్జున్ ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలిసిందే .
కాగా రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక విషయం బయటపడింది. పుష్ప సినిమా కన్నా ముందే ఒక సినిమాలోని పాట కోసం అల్లు అర్జున్ బిగ్ రిస్క్ చేశాడని .. ఆల్మోస్ట్ ఆల్ చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు “సరైనోడు”. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయింది . పాటలు మరి ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకున్నాయి . కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
ఈ సినిమాలో అందరికీ ఫేవరెట్ సాంగ్ “తెలుసా తెలుసా”. ఈ పాట కోసం అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ సింగ్ బాగా కష్టపడ్డారట. ఈ పాట కోసం హీరో హీరోయిన్ డైరెక్టర్ తో సహా టీం కూడా ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండే ప్రాంతంలో షూట్ చేయాల్సి వచ్చిందట . ఈ సాంగ్ అద్భుతంగా రావాలి అన్న అల్లు అరవింద్ ఎంత ఖర్చయినా పర్వాలేదు అంటూ సాంగ్ డిఫరెంట్ గా చిత్రీకరించమన్నారట. దీంతో బోయపాటి శ్రీను ఏకంగా ఇప్పటివరకు ఇండియాలో ఎవ్వరు షూట్ చేయని లొకేషన్ ని కన్ఫామ్ చేసుకొని అక్కడికి వెళ్లారు.
సౌత్ అమెరికాలోని బొలీవియా అక్కడ 50 గంటల పాటు విమానంలో ప్రయాణిస్తే కానీ ఆ బ్యూటిఫుల్ లోకేషన్ రాదు. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది . గట్టిగా మాట్లాడకూడదు ఫాస్ట్ గా నడవకూడదు అంతా సాల్ట్ ఫ్లాట్ లొకేషన్ . కింద అంత ఉప్పు.. ఎవరైనా బై మిస్టేక్ కింద పడితే నా స్కిన్ మొత్తం తెగిపోతుంది రక్తం వచ్చేస్తుంది. అంత షారర్ప్.. మరి అలాంటి ల్యాండ్ పై బన్నీ ఎంత రిస్క్ చేశాడో మనం చూసాం. నాలుగు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట. ఆయన కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉందని చెప్పొచ్చు . ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ చాలామంది ప్లే లిస్ట్ లో ఈ పాట ప్లే అవుతూనే ఉంటుంది..!!