నేడు వాలెంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్ ..యంగ్ కపుల్స్.. రొమాంటిక్ కపుల్స్ . రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా అక్కినేని నాగచైతన్య తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్య ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు .
నాన్న-తాత అంత గ్రేట్ కాకపోయినా తనకంటూ ఓ రేంజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్గా ఆయన నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న రీల్ ని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు సాయి పల్లవి – నాగచైతన్య .
వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య – సాయి పల్లవి తో చేసిన రీల్ ఇప్పుడు వైరల్ అవుతుంది . “బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే.. నవ్వవే “అంటూ నాగచైతన్య ఎంతో ప్రేమగా మాట్లాడిన మాటలు ..దానికి సాయి పల్లవి సిగ్గుపడుతూ చేసిన రిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ జంట చూడ చక్కగా ఉంది ..పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య – సాయి పల్లవి బావ మరదలుగా కనిపించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో వాళ్ళకి పెళ్లి కూడా చేస్తారట. ప్రజెంట్ వీళ్లు చేసిన రీల్ వైరల్ గా మారింది..!!