Moviesసినీ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని సెన్సేషనల్ రికార్డ్.. "కల్కి" కోసం...

సినీ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని సెన్సేషనల్ రికార్డ్.. “కల్కి” కోసం దీపిక పదుకోనే ఏం చేసిందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా హద్దులు మీరి పోతున్నారు. స్టార్ హీరోనే కాదు.. వాళ్లకు మేము ఏమాత్రం తీసిపోము అంటూ యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు. మరికొందరు ఏకంగా స్టార్ హీరోలకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో అంతే ఇవ్వాలి అంటూ పట్టు బట్టి డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

దీపికా పదుకొనే టాలీవుడ్ లో నటిస్తున్న ఫస్ట్ సినిమా కల్కి 2898 ఏడి . ప్రభాస్ హీరోగా నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆమె ప్రభాస్ తో జతకడుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది . దీపికా పదుకొనే లుక్స్ – స్టైల్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా కోసం దీపికా పదుకొనే తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తీసుకోని అటువంటి రెమ్యూనరేషన్ ని దీపికా పదుకొనే ఈ సినిమా కోసం ఛార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కోట్లు తీసుకుందట . ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ..బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె ఈ రేంజ్ పారితోషకం పుచ్చుకోలేదట. దీంతో ఇదే న్యూస్ సెన్సేషనల్ గా మారింది
. ఇప్పటివరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ల లిస్టులో నయనతార ఉంది . సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార జవాన్ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు పుచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తుంది దీపికా పదుకొనే.. ఏకంగా 20 కోట్లు ఛార్జ్ చేసిందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news