Moviesఎప్పుడు ఎవరిపై చెయ్యి ఎత్తని ఎన్టీఆర్..ఆ విషయంలో సావిత్రిని లాగిపెట్టి కొట్టారా..?...

ఎప్పుడు ఎవరిపై చెయ్యి ఎత్తని ఎన్టీఆర్..ఆ విషయంలో సావిత్రిని లాగిపెట్టి కొట్టారా..? ఎందుకంటే..?

సావిత్రి .. సినిమా ఇండస్ట్రీ మర్చిపోలేని పేరు . 100 జన్మలు కాదు వెయ్యి జన్మలు ఎత్తినా సరే మహానటి అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు సావిత్రి . ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..నటనకి నటన .. అబ్బో ఒకటా..? రెండా..? సావిత్రి గారి పేరు తలుచుకుంటూ ఉంటేనే ఇప్పటికే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చిన్న ఎక్స్పోజింగ్ చేయకుండా చిన్న బూతు పదం మాట్లాడకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటి ఈ మహానటి సావిత్రి.

ఆమె గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే రాత్రి పగలు సరిపోదు .. ఎన్నో ఎన్నో సంవత్సరాలు కావాలి. అలాంటి ఓ అద్భుతమైన చరిత్ర ఆమె సొంతం . అయితే అన్ని విషయాల్లో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకునే సావిత్రి కెరియర్ లో మాత్రం కోలుకోలేని తప్పు చేసింది . ఆ కారణంగా లాస్ట్ రోజుల్లో దారుణాతి దారుణమైన స్థితిలో మరణించింది. అందరికీ తెలిసిందే సావిత్రి జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేషన్ కి పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు.

అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే మొదటి నుంచి సావిత్రి అంటే చాలా గౌరవం ఇష్టం ఉన్న ఎన్టీఆర్ ముందు నుంచే జెమినీ గణేషన్ కి దూరంగా ఉండమంటూ హెచ్చరించారట. కానీ ప్రేమ మాయలో సావిత్రి ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదట . తీరా జెమినీ గణేషన్ నిజస్వరూపం తెలుసుకున్నాక బాగా బాధపడిందట . అంతేకాదు సూసైడ్ కూడా చేసుకోబోయిందట. ఆ టైంలో ఎన్టీఆర్ ఆమెను లాగిపెట్టి కొట్టారట . అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.

ఎప్పుడు ఎవరిపై చెయ్యి ఎత్తని ఎన్టీఆర్ ..సావిత్రి పై అలా చెయ్యి ఎత్తడం అప్పట్లో సినీ జనాలకు ఆశ్చర్యం కలిగించింది . కానీ ఒక చెల్లిగా .. ఒక ఫ్రెండ్ గా ఆమె జీవితం నాశనం అయిపోవడం చూడలేకనే ఎన్టీఆర్ అలా చేశాడు అంటూ జనాలు అప్పట్లో మాట్లాడుకునేవారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news