మమ్ముట్టి ప్రధాన పాత్రలో కోలీవుడ్ హీరో జీవా మరొక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర2. దర్శకుడు మహీ వి రాఘవ తెరకెక్కించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . మొదటినుంచి ఈ ఏ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే దర్శకుడు ఎక్కడ కూడా ఫాన్స్ ని హర్ట్ చేయకుండా తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు . ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసాయి ..ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు .
2019లో వచ్చిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. 2019లో వచ్చిన యాత్ర సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అనుకుంటున్న తరుణంలో తన సొంత కష్టంతో పాదయాత్ర చేసి వైయస్సార్ ఎలా విజయం సాధించాడు ..కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు .. అన్నది మొత్తం మనం యాత్ర వన్ లో చూడొచ్చు .
అయితే యాత్ర 2 వచ్చేసరికి జగన్ బయోపిక్ అనే చెప్పాలి . దివంగత నేత వైఎస్సార్ కొడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ నే ఈ యాత్ర 2. తండ్రి మరణాంతరం చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే ఈ యాత్ర 2. దర్శకుడు మహీవి రాఘవ యాత్ర టూ ను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు . ఎక్కడ కూడా ఎవరిని కించపరచకుండా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా చాలా క్లీన్ గా సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసి జనాలను మెప్పించాడు .
ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా జగన్ అభిమానులనే కాదు వైయస్సార్ అభిమానులను సైతం ఆకట్టుకుంటుంది . వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి మరోసారి నటించి మెప్పించాడు . ఇక జగన్ పాత్రలో జీవ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . మరో జగన్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ గా ఆయన బాడీ మోడ్యులేషన్స్ కాపీ చేశాడు . కొన్ని కొన్ని సార్లు నిజంగానే జగన్ తెరపై నటిస్తున్నాడేమో అని ఆశ్చర్యపోక తప్పదు . అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు .
యాత్ర 2 ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా బాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. మొత్తంగా వైయస్సార్ జగన్ అభిమానులను సంతృప్తి పరుస్తుంది ఈ యాత్ర 2 సినిమా . కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ ని వైయస్సార్ ప్రజలకు పరిచయం చేయడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కూడా డైరెక్టర్ ఎక్కడ ఉన్నవి లేనివి కలిపించకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించి సినిమాను తెరకెక్కించడం హైలెట్ అనే చెప్పాలి.
ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా చూపించడానికి బాగా ట్రై చేశాడు డైరెక్టర్. జనరల్ గా ఇలాంటి సినిమాలలో ప్రత్యర్థులను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ మాత్రం ఆ తప్పు చేయలేదు జగన్ బలమైన లీడర్ అని చెప్పే ప్రయత్నం చేశాడు తప్పిస్తే.. మిగతా వాళ్ళను ఎక్కడ కూడా వేలెత్తి చూపించే ప్రయత్నం చేయలేదు . పక్కాగా చెప్పాలంటే యాత్ర 2 వైయస్సార్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా . సాంకేతిక విషయాల గురించి మాట్లాడితే మ్యూజిక్ పరలేదు ..బిజిఎం కూడా పర్లేదు .
ఏవి ఎంతలో ఉండాలో అంతలా ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నారు డైరెక్టర్ . మాయ ముసుగులో ఉన్న జనాలను నిద్ర లేపే సినిమా..ఓ స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా వైయస్ జగన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలానే ఉన్నాయి కొన్ని సీన్స్ అంటున్నారు జనాలు . చూద్దాం ఫస్ట్ డే ఏ విధంగా ఉంటాయో కలెక్షన్స్..?