Moviesసినీ ఇండస్ట్రీని మడత పెట్టేసే కాంబో ఇది.. ప్రభాస్ సినిమాలో ఆఫర్...

సినీ ఇండస్ట్రీని మడత పెట్టేసే కాంబో ఇది.. ప్రభాస్ సినిమాలో ఆఫర్ అందుకున్న నేషనల్ ఫిగర్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతున్నాడు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే .. మరోవైపు తన హెల్త్ పట్ల కేర్ తీసుకుంటూ సర్జరీకి సిద్ధమవుతున్నాడు . ఆయన రీసెంట్ గా నటించిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా అభిమానులను ఎలా ఆకట్టుకునిందో మనం చూసాం. అయితే సలార్ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ అవ్వాలి.

ఆ తర్వాత రాజా సాబ్. ఈ రెండు సినిమాలు అయిపోగానే సలార్ 2 సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది . దీనితోపాటు ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కమిటైన సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళబోతుంది . ఈ సినిమాకు స్పిరిట్ అంటూ ఎప్పుడో నామకరణం చేసేసారు. ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు జనాలు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

నిజానికి ఈ రోల్ కోసం బాలీవుడ్ న్యూటీస్ ని చాలా మందిని అనుకున్నాడట సందీప్. కానీ అమ్మడుకు ఉన్న క్రేజ్.. డిమాండ్ కారణంగానే సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నారట . పైగా యానిమల్ సినిమాల్లో సందీప్ కు బాగా సపోర్ట్ చేసింది రష్మిక. ఆ కారణంగానే మరోసారి ఆమెకు బిగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట . దీంతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా – ప్రభాస్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news