సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎలా విడాకులు తీసుకుంటున్న వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా బడాబడా స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకుంటూ ఉండడం ఫ్యాన్స్ కి కూడా మింగుడు పడడం లేదు . ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు విడాకులు తీసుకున్నారు . కాగా రీసెంట్గా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ కపుల్ గా నిలిచిన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. గత కొన్ని నెలలుగా వీళ్ళ విడాకుల వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది . రీసెంట్గా అయోధ్య రామ మందిరం ఉత్సవానికి అభిషేక్ బచ్చన్ ఒక్కడే హాజరు కావడం ఐశ్వర్యారాయ్ రాకపోవడం అందరికీ కొత్త డౌట్లు పుట్టించింది.
ఇలాంటి క్రమంలోనే అభిషేక్ బచ్చన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టుకోవచ్చాడు . ఈ పోస్టుతో ఆయన విడాకులు ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . “పరాజయ భయం కలలను నాశనం చేస్తుంది. కానీ ఆ ఓటమి నేర్చుకుంటే కలలు నిజమవుతాయి అని అభిషేక్ రాసుకొచ్చాడు”. దీంతో ఈ జంట విడాకుల వార్త మళ్ళీ వైరల్ అవుతుంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోబోతున్నాను అంటూ పరోక్షకంగా హింట్ ఇచ్చేశాడు అభిషేక్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో త్వరలోనే తేలిపోబోతుంది..!!