టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎట్టకేలకు సూపర్ హిట్ కొట్టారు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అంచనాలు అందుకోలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. కేజీయఫ్ సీరిస్ సినిమల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ గత డిసెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.
ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులతో పాటు నేషనల్ వైడ్‌గా ఉన్న సినీ ప్రేమికుల ఆశలు, అంచనాలు అన్నీ ప్రభాస్ తాజా సినిమా కల్కి కల్కి 2898 ఏడీ మీదే ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కాకుండా.. పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతతోంది. అందుకు తగినట్టుగానే అన్నీ ప్రయత్నాలు నడుస్తున్నాయి.
టైటిల్ ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కూడా అన్ని హాలీవుడ్ రేంజ్‌లోనే ఉండేలా చూస్తున్నారు. ఈ సినిమాకు మేకర్స్ ప్లానింగ్ అయితే మామూలుగా లేదు. వరల్డ్ పాపులర్ కామిక్ కాన్‌లో కల్కి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ నుంచే స్టార్ట్ చేయడం బిగ్ థింగ్‌గా మారింది. సినిమా టీజర్ కూడా ఇదే తరహా ఫస్ట్ ఎవర్ ప్లానింగ్ ఇండియన్ సినిమా నుంచి చేస్తున్నట్టు బజ్ వినిపిస్తోంది.
చాలా హాలీవుడ్ సినిమాల టీజర్స్ ఫస్సట్ టైం ప్లే చేసే హైయ్యస్ట్ వ్యూవర్ షిఫ్ కలిగిన సూపర్ బౌల్ ఈవెంట్లో కల్కి టీజర్‌ను ప్రజెంట్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఇండియన్ సినిమా నుంచి ఫస్ట్ టైం ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సినిమాగా కల్కి నిలవబోతోంది. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్టోన్న ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత.