Moviesఅల్లు అర్జున్ - స్నేహారెడ్డి ప్రేమ ఫ‌స్ట్ టైం ఎవ‌రి ద్వారా...

అల్లు అర్జున్ – స్నేహారెడ్డి ప్రేమ ఫ‌స్ట్ టైం ఎవ‌రి ద్వారా లీక్ అయ్యిందో తెలుసా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్ అమ్మాయిల విష‌యంలో చాలా సైలెంట్‌గా ఉండేవాడు. హీరోయిన్ల విష‌యంలోనూ అర్జున్‌పై పెద్ద‌గా రూమ‌ర్లు లేవు. అలాంటిది సైలెంట్‌గా స‌డెన్‌గా స్నేహారెడ్డి మాయ‌లో ప‌డిపోయాడు. ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డి ఎవ‌రో కాదు ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె.

స్నేహ కుటుంబానికి ఇబ్ర‌హీంప‌ట్నంలో ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. ఆమె ఆ కాలేజ్‌ల బాధ్య‌త‌లు చూసుకునేది. ఓ ప్రైవేటు పార్టీలో కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ఆమెకు బ‌న్నీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. త‌ర్వాత స్నేహితులు అయ్యారు. ఫోన్ నెంబ‌ర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ముందు బ‌న్నీయే ఆమెను ఇష్ట‌ప‌డ్డాడు. స్నేహ‌లో ఉన్న ఆక‌ర్ష‌ణ‌, ఆమె అందానికి బ‌న్నీ మైమ‌రిచిపోయాడు.

స్నేహా వాళ్ల‌కు కూడా మంచి ఆస్తులే ఉన్నాయి. వాళ్ల కుటుంబం న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జునా సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దవూర మండ‌లానికి చెందిన‌వాళ్లు. వాళ్లు ఎప్పుడో హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డి.. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆస్తులు, అంత‌స్తుల ప‌రంగా ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. పైగా కులాలు వేరు.. బ‌న్నీ కాపు వ‌ర్గానికి చెందిన వారు అయితే.. స్నేహావాళ్లు రెడ్డి వ‌ర్గం వాళ్లు.

బ‌న్నీ త‌న ప్రేమ‌ను త‌న ఇంట్లో ఎవ్వ‌రికి చెప్పాలో తెలియ‌క చాలా స‌త‌మ‌త‌మ‌య్యాడ‌ట‌. చివ‌ర‌కు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన త‌న త‌ల్లికి తాను స్నేహ‌ను ప్రేమిస్తున్న విష‌యం చెప్ప‌గా.. అమ్మాయి నీకు న‌చ్చితే నాకు ఓకే అని హామీ ఇచ్చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్ని బ‌న్నీ త‌ల్లి .. త‌న భ‌ర్త అర‌వింద్‌కు చెప్ప‌గా ఆయ‌న ముందు చిట‌ప‌ట‌లాడినా త‌ర్వాత బ‌న్నీ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

ఇక సోష‌ల్ మీడియాలో స్నేహారెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. స్టార్ హీరోల‌ను మించిన రేంజ్‌లో ఫాలోయింగ్ స్నేహ సొంతం. ఇక స్నేహ కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఉంది. ఆమె తండ్రి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి 2014లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news