మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే కేవలం హీరోలు గానే కాదు హీరోయిన్లుగా కూడా పలువురు ఎంట్రీ ఇచ్చారు . కొంతమంది సక్సెస్ అయితే మరి కొంత మంది ఫ్లాప్ అయ్యారు. అయితే చాలామంది నాన్న అమ్మ హీరో హీరోయిన్లుగా ఉన్నప్పుడు కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు .
అయితే వాళ్లందరిలోకి స్పెషల్ గా నిలిచారు బాలయ్య కూతుర్లు బ్రాహ్మిణి – తేజస్విని . ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా రావడానికి అస్సలు ఇష్టపడలేదు. చిన్నప్పటి నుంచి తాత తండ్రిని సినిమా రంగంలో చూసిన సరే వాళ్లకి ఎందుకో సినిమా ఇండస్ట్రీ అంటే పడదు . అయితే చాలామంది డైరెక్టర్లు మాత్రం బ్రాహ్మిణిని తేజస్విని హీరోయిన్ చేయాలి అంటూ బాగా ట్రై చేశారట .
కానీ అది కుదరలేదు ఒక డైరెక్టర్ అయితే ఏకంగా స్క్రిప్ట్ తీసుకెళ్లి బాలయ్య ముందు కూర్చొని ..”మీ కూతురు తేజస్విని ఈ సినిమాలో హీరోయిన్గా చేయాల్సిందే అంటూ పట్టు పట్టారట. కానీ తేజస్విని కి ఇంట్రెస్ట్ లేకపోవడంతో బాలయ్య ఆ సినిమాను రిజెక్ట్ చేశారట”. అంతేకాదు ఆ తరువాత కూడా చాలా ఛాన్సులు వచ్చినా ఏవి కూడా అమె ఓకే చేయలేదట..!!