టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ప్రారంభంలో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా మహేష్‌బాబు వన్ మ్యాన్ షో కావడంతో పాటు మరో రెండున్నరేళ్ల వరకు రాజమౌళి సినిమాకు మహేష్ అంకితమవ్వాల్సి ఉండడం.. అప్పటి వరకు మహేష్‌ను వెండితెర మీద చూసే ఛాన్స్ లేకపోవడంతో గుంటూరు కారం థియేటర్లకు తెలుగు సినీ అభిమానులు పోటెత్తారు.
సినిమాకు మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా దాంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు తరలి రావడంతో గుంటూరు కారంకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కేవలం ఫస్ట్ వీక్ ముగిసే సరికే ఈ సినిమాకు రు. 212 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా వసూళ్లు రు. 240 కోట్ల రేంజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 12 రోజులకు వచ్చిన వసూళ్లు చూస్తే గుంటూరు కారం బిజినెస్ టార్గెట్‌లో 97 శాతం రికవరీ అయినట్టు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమా సాలీడ్ బిజినెస్ చేసింది. అన్ని ఏరియాల్లోనూ చిన్న చిన్న మొత్తాలు మినహా గుంటూరు కారం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకొచ్చినట్టు ట్రేడ్ చెపుతోంది. అయితే ఈ సినిమా వసూళ్లు చాలా చోట్ల బాగా డ్రాప్ అయ్యాయి. ఇప్పటికే గుంటూరు కారం సినిమా తీసేసి హనుమాన్ సినిమా వేస్తున్నారు.
చాలా చోట్ల థియేట్రికల్ రన్ కూడా ముగుస్తోంది. జనవరి 26న కొత్త సినిమాలు ఉన్నాయి. ఇక గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. ఈ టైంలో ఈ సినిమా నుంచి లాభాలు అయితే ఆశించలేం. కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలతో బయటపడే ఛాన్సులున్నాయి. ఇక మహేష్‌బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.