ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయ నాయకులు, నాయకురాళ్ల ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం కామన్. మన తెలుగు కుర్రాడు అయిన యంగ్ ఐఏఎస్ హైదరాబాద్‌కు చెందిన ఓ యంగ్ డాక్టర్ కం మోడల్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. తిరుపతికి చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ పవన్ దత్త త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన డాక్టర్, మోడల్ అయిన తేజస్విని మనోజ్ఞను పెళ్లాడుతున్నాడు.
వీరిద్దరికి వివాహం నిశ్చయమైంది. వీరి పెళ్లి ఫిబ్రవరి 24న జరగబోతోంది. ఈ క్రమంలోనే వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ వివాహ తొలి ఆహ్వాన పత్రికను తిరుమల వేంకటేశ్వరునికి సమర్పించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో అమీర్‌పేటలో డాక్టర్‌గా పనిచేస్తోన్న ఫేమస్ ఇండియన్ మోడల్.
ఆమె డాక్టర్‌గా పని చేయడంతో పాటు అందాల పోటీ టైటిల్ హోల్డర్ కూడా..! డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2019 పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఫిలిప్పైసన్లోని పరానక్ సిటీలో జరిగిన 19వ మిస్ ఎర్త్ పోటీల్లో ఆమె భారతదేశానికి ప్రాథినిత్యం వహించారు.