Movies"ఇష్టం లేకుండానే ఆ పని చేశా.. సీన్ అయిపోగానే రూమ్‌లోకి వెళ్లి...

“ఇష్టం లేకుండానే ఆ పని చేశా.. సీన్ అయిపోగానే రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశాను”.. రష్మిక హార్ట్ టచింగ్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా రష్మిక తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. దీనంతటికీ కారణం పుష్ప అని చెప్పక తప్పదు . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసిన రష్మిక ఆ తర్వాత ఆమె స్థాయిని రేంజ్ ని డబల్ కాదు ట్రిపుల్ చేసేసుకుంది.

రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకునింది . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యానిమల్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని బయటపెట్టింది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన అనిమల్ సినిమాలో రష్మిక టూ బోల్డ్ గా నటించింది . అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నిజంగా ఒక భార్య ఎలా ఫీల్ అవుతుందో అలాగే ఫీల్ అవ్వాలని సందీప్ రెడ్డి ఆమెకు చెప్పాడట.

” ఇక సీన్ స్టార్ట్ అయింది అంతే ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్ లో చేసేసాం.. ఎందుకంటే ఆ సీన్ లో బాగా కదలికలు ఇంపార్టెంట్ ..ఏది అంచనా వేయలేని పరిస్థితి .. నేను ఏం చేయబోతున్నానో కూడా నాకు తెలియని పరిస్థితి.. నాకు డైరెక్టర్ చెప్పింది మాత్రమే గుర్తుంది.. మిగతా ఏమీ గుర్తులేదు యాక్షన్ కట్ తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనుకున్నాను ..అసలు ఏం చేశానో కూడా తెలియదు.. అంతే రన్బీర్ ను లాగిపెట్టి కొట్టాను ..ఆ సీన్ అయిపోగానే అందరూ చప్పట్లతో నన్ను ఎంకరేజ్ చేశారు . అయితే నేను మాత్రం రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేసాను.. ఎందుకో తెలియదు నాకు చాలా బాధగా అనిపించింది “అంటూ రష్మిక చెప్పుకు వచ్చింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news