ఎస్ .. సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజా మొగనున్నాయా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది సాయి పల్లవి సిస్టర్ పూజ . మనకు తెలిసిందే సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే సాయి పల్లవి రొమాన్స్ వల్గర్ సీన్స్ లో నటించదు .
కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటూ ఉంటుంది . అందుకే సాయి పల్లవి అంటే జనాలకి బాగా ఇష్టం. అయితే సాయి పల్లవి చెల్లి కూడా సినిమా ఇండస్ట్రీలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది . సాయి పల్లవి సిస్టర్ పెళ్లి చేసుకోబోతుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది . “నిన్న మొన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు లైఫ్ పార్టనర్ గా మారబోతున్నాడు “అంటూ తన ఫియాన్సీ ఫోటోను ఆయనతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంది .
దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి సిస్టర్ కు శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. అయితే అక్కకంటే చెల్లి ముందే పెళ్లి చేసుకుంటూ ఉండడం అభిమానులకు డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. మరి కొందరు ఇవన్నీ ఇప్పుడు కామన్ అంటూ చిలౌట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. నెక్స్ట్ మన సాయిపల్లవినే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!