టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన సినిమా హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . గుంటూరు కారం కి గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది. సినిమాలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ హైలెట్ అనే చెప్పాలి . తేజ కూడా సినిమా కోసం బాగా కష్టపడ్డాడు .
ఈ సినిమాలో తేజ సజ్జాకి సిస్టర్ క్యారెక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఆమె పాత్రకు ఆమె తగిన న్యాయం చేసింది. సినిమా క్లైమాక్స్ లో ఆమె చనిపోతుంది. ఆ సెంటిమెంట్ సీన్స్ బాగా పండించాడు ప్రశాంత్ వర్మ. నిజానికి ఈ క్యారెక్టర్ లో మొదటగా హీరోయిన్ ప్రియమణిని చూస్ చేసుకున్నారట . కానీ ఆమె చిన్న క్యారెక్టర్ కావడంతో రిజెక్ట్ చేసిందట .
ఆ తర్వాత ఈ క్యారెక్టర్ కోసం చాలామందిని ట్రై చేసిన ఫైనల్లీ వరలక్ష్మి శరత్ కుమార్ సెలెక్ట్ అయింది . ఈ పాత్రకు ఆమె తప్పిస్తే మరి ఎవరు సూట్ కారు అన్న విధంగా నటించింది. హనుమాన్ మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. తేజ సజ్జ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ తో పాటు, సినిమాకు పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చాడు.