సినిమా ఇండస్ట్రీలో జనరల్ గా స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం సర్వసాధారణం . ఈ విషయం మనందరికీ తెలిసిందే . చాలా మంది హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసుకుంటూ ఉంటారు . మరి కొన్నిసార్లు హద్దులు మీరిపోతూ హీరోల భార్యలను కూడా లాగి ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఆ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయిపోయారు కొంతమంది స్టార్ హీరో ఫ్యాన్స్ . అంతేకాదు స్టార్ హీరోలు ఎంత చక్కగా ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తారో అలాగే మనం కూడా మెయింటైన్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే “మీకు మేము మాకు మీరు ” అనే కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. కాగా బన్నీ – తారక్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. ఇద్దరు ముద్దుగా బావ బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. పుట్టినరోజులు అయినా ..ఈవెంట్స్ అయినా ..ఫంక్షన్ అయినా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు . ఒకరికొకరు చాలా స్పెషల్ గా విష్ చేసుకుంటారు. కాగ అదే ఫ్రెండ్షిప్ ని ఫాన్స్ కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు.
గతంలో అలా వైకుంఠపురం సినిమా టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి బన్నీ ఫాన్స్ సపోర్ట్ చేశారు. అంతేకాదు దేశముదురు సమయంలో రిలీజ్ టైం లో కూడా బన్నీ ఫ్యాన్స్ తారక్ కి సపోర్ట్ చేశారు . పుష్ప సినిమాకి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు . ఇప్పుడు దేవర కి రిటర్న్ గిఫ్ట్ చేద్దామనుకుంటున్నారు బన్నీ ఫాన్స్. దేవర సినిమాకి బన్నీ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి సంబంధించి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం “మీరు మా హీరోకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కనీసం ట్రోల్ చేయొద్దు చాలు ” అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సరికొత్త వార్ మొదలైంది..!!