బ్రహ్మానందం .. సినిమా ఇండస్ట్రీలో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ పాత్రలు చేస్తూ ఇప్పటికే సినిమాలో తనదైన స్టైల్ లో కామెడీని పండించి నవ్విస్తున్నాడు . బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా సరే బ్రహ్మానందం క్యారెక్టర్ మాత్రం అందరికీ నచ్చితీరుతుంది .
అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు బ్రహ్మానందం . కాగ ఇటీవల ఆయన ఆత్మ కథని పుస్తకం రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఈ పుస్తకంలో ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో క్లియర్గా రాశారు . . ఈ పుస్తకంలో తన పెళ్లి గురించి ఆయన రాసిన పద్ధతి అందరిని ఆకట్టుకుంటుంది . బ్రహ్మానందం ఎన్నో కష్టనష్టాలు దాటుకొని చదివి కాలేజీలో లెక్చరర్ గా మారి జాబ్ సంపాదించుకున్నాడు . అత్తిలిలో లెక్చరర్ గా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడడం మొదలుపెట్టారట . చిన్నప్పటి నుంచి బాగా కష్టపడడంతో ఇక జాబ్ రావడం పైగా మంచి శాలరీ ఉండడంతో డబ్బున్న అమ్మాయి కోడలుగా వస్తే కట్నం తెస్తుంది అంటూ తల్లిదండ్రులు ఆశపడ్డారట .
అయితే బ్రహ్మానందం మాత్రం తన చదువుకి సహాయం చేసిన అనసూయమ్మ అనే ఆవిడ తెచ్చిన సంబంధమే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారట. అనసూయమ్మ ఆమె భర్త చెల్లెలు ఒకరైన లక్ష్మీని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని బ్రహ్మానందం కి సలహా ఇచ్చారట . బ్రహ్మానందం కూడా లక్ష్మీని ఆల్రెడీ చూడడం ఆమె అంటే ఇష్టం ఉండడం తో ఆయన ఈ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట . కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదట . దీంతో బ్రహ్మానందం రాద్ధాంతం చేసి పెళ్లి అంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను .. లేకపోతే చేసుకోను అంటూ మొండిగా భీష్మించుకుని కూర్చున్నాడట. ఇక ఆ టైంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఒప్పుకున్నారట . బ్రహ్మానందం కి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరి పెళ్లి 1977 డిసెంబర్ 14న జరిగింది..!!