వాట్ .. రష్మిక మందన్నా.. నాగశౌర్యకి సిస్టర్ అవుతుందా..? ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా.. నాగశౌర్య జంటగా నటించిన సినిమా “ఛలో” .ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత మహేష్ బాబు – బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.
ఇప్పుడు రష్మిక మందన్నా పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎక్కువమంది ఉన్నారు. రష్మిక మందన్నా – నాగశౌర్యకి సిస్టర్ అవుతుందట . అది ఎలా అనుకుంటున్నారా..? నాగశౌర్య – రష్మిక మందన్న ఛలో సినిమా షూటింగ్లో నాగశౌర్య అమ్మ నాన్నగారు వచ్చినప్పుడు ..రష్మిక చాలా బాగా మాట్లాడిందట . అచ్చం కూతురులాగే చూసుకుందట. అప్పుడే నాగశౌర్య అమ్మానాన్న ..”నువ్వు నా కూతురువి అంటూ అమ్మ నాన్న అని పిలవమంటూ చెప్పుకొచ్చారట “.
అప్పటినుంచి ఇప్పటివరకు కూడా నాగశౌర్య వాళ్ళ అమ్మానాన్నను ఆమె మమ్మీ డాడీ అంటూ పిలుస్తూనే ఉందట . అలా సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన అమ్మా నాన్నగా నాగశౌర్య పేరెంట్స్ మారిపోయారు రష్మికకు.. అంతేకాదు రష్మిక కూడా నాగశౌర్యను చాలా సార్లు అన్నయ్య అంటూ పిలిచిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో ఆమె బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది..!!