కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన ఖడ్గం సినిమాలో “ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క చాన్సు ” అంటూ ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేసిన హీరోయిన్ సంగీత ని ఎవరైనా మరచిపోగలరా! ఇటు ఫ్యామిలీ పాత్రలతో పాటు కొన్ని రొమాంటిక్ పాత్రలు కూడా చేసిన సంగీత, తెలుగు తో పాటు గా తమిళ చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య ఒక పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను చేసిన ఒక నెగటివ్ పాత్ర గురించి ఇన్నాళ్ళకి చెప్పుకొచ్చింది.
శ్రీరామ్ హీరోగా నటించిన 2006లో వచ్చిన తమిళ చిత్రం ఉయిర్(తెలుగు లో మనోహరం) లో తాను ఎన్నటికీ మరచిపోని పాత్రని వెయ్యవలసి వచ్చిందని .. ఆ పాత్రని తలచుకుంటే ఇప్పటికీ తన వళ్ళు జలదరిస్తుందని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో తాను నెగటివ్ పాత్రలో చేశానని, తన భర్త తమ్ముడితో రొమాన్స్ చేయాలనుకునే బోల్డ్ పాత్రలో నటించానని, తన సినిమాని తనే థియేటర్ లో చూడలేకపోయానని, ఈ సినిమా అప్పట్లో దుమారం రేపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు.