అయిపోయింది కొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే 2023 వెళ్ళిపోయి 2024 రాబోతుంది. కోట్లాదిమంది జనాలు భారీ భారీ స్థాయిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . 2024 ఇయర్ ఈ నలుగురు హీరోలకి చాలా చాలా స్పెషల్ అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .
2024 లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో ఆయన బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దేవర సినిమా కూడా 2024 లోనే రిలీజ్ కాబోతుంది . అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది . రాంచరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం .
అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన పుష్ప సీక్వెల్ పుష్ప 2 ఆగస్టు లో రిలీజ్ కాబోతుంది . దీంతో సినిమా ఇండస్ట్రీ లో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. 2024 సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమని బడా సినిమాలు రాబోతున్నాయి అని ముఖ్యంగా ఈ నలుగురు హీరోలకి ఈ 2024 మోర్ మోర్ మోర్ స్పెషల్ అంటున్నారు అభిమానులు..!!