టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా ఈనెల 22న థియేటర్లలో రిలీజ్ అయ్యి భారతీయ సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు దాటేసిన సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణతో పాటు బాలీవుడ్‌లో దమ్ము రేపుతున్న సలార్.. కర్ణాటక, తమిళనాడులో మాత్రం అనుకున్న అంచనాలు అందుకోలేదు.
అటు ఓవర్సీస్ లోను ఇప్పటికే 8 మిలియన్ డాలర్లు దాటేసి.. 10 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతుంది. ఇది ఇలా ఉంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సినిమా సెన్సేషన్ రన్ కొనసాగిస్తుంది. బెంగళూరులో ఫస్ట్ వీక్ సలార్ సినిమాకు ఆరువేలకు పైగా షోలు పడ్డాయి. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత సలార్ ఈ రేర్ ఫీట్ సొంతం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా బెంగళూరులో 8 రోజుల్లో 6వేల షోలు ప్రదర్శించారు. అయితే సలార్ సినిమా కేవలం 7 రోజుల్లోనే 6వేలకు పైగా షోలు ప్రదర్శించారు.
ఇది మామూలు రికార్డ్ కాదని చెప్పాలి. బెంగళూరులో వీరవిహారం చేస్తున్న సలార్.. మిగిలిన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం అనుకున్న స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. ఈ సినిమాకు పని చేసిన నిర్మాత, దర్శకుడు మిగిలిన సాంకేతిక నిప్పుణులు అందరూ కన్నడం వాళ్లే. అయినా ఎందుకో కర్ణాటకలో అంచనాలు అందుకోలేదు. ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిగా.. పృథ్విరాజ్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలలో నటించారు.