Moviesదేవుడు ఉన్నాడా..? లేడా..? అని తెలుసుకోవడానికి ..మందు కొట్టి శివాలయానికి వెళ్లిన...

దేవుడు ఉన్నాడా..? లేడా..? అని తెలుసుకోవడానికి ..మందు కొట్టి శివాలయానికి వెళ్లిన రాజశేఖర్.. లాస్ట్ ట్విస్ట్ హైలెట్..!!

రాజశేఖర్.. ఈ పేరు కంటే ఇప్పుడు క్రేజ్ పాపారాటీ తగ్గిపోయింది గాని ఒకప్పుడు ఈ పేరు చెప్తే పాన్ ఇండియా హీరోలు థియేటర్లో కనిపిస్తే వచ్చే అరుపులకన్నా ఎక్కువగా ఉండేవి. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాజశేఖర్ ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీకి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేటి యువతకు ఈయన విలువ తెలియకపోయినా ఒకప్పటి జనరేషన్ కి మాత్రం రాజశేఖర్ ది ఫేవరెట్. ఇప్పటికి మన ఇంట్లోనే అమ్మమ్మలకు తాతలకు ఫేవరెట్ హీరో రాజశేఖర్ గా ఉన్నాడు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సినీ ఇండస్ట్రీకి రావాలని ఆయనకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు . కానీ ఆయన తండ్రి కోసం ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రతిఘటన అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదట విలన్ గా నటించిన రాజశేఖర్ ఆ తర్వాత సినిమాలో హీరోగా మారడం హీరోగా చేయడం ప్రారంభించారు . అప్పట్లో పోలీసు పాత్ర అంటే అందరికీ గుర్తొచ్చేది రాజశేఖర్ . అంకుశం లో ఆయన పోషించిన పోలీస్ పాత్ర నిజ జీవితంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని చెప్పడంలో సందేహం లేదు.

రాజశేఖర్ కు కొన్ని కొన్ని పాత్రలు భలే సూట్ అవుతాయి .. ఆ పాత్రలో ఆయన తప్పిస్తే మరెవరిని ఊహించుకోలేం. రీసెంట్ గా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో కూడా నటించాడు రాజశేఖర్ . అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర్ దేవుడిపై నమ్మకం లేక చేసినటువంటి పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రాజశేఖర్ ఒక అమ్మాయిని ప్రేమించాడట ఐదేళ్లు పైగానే అమ్మాయి చుట్టూ తిరిగారట ..కానీ అమ్మాయి రిజెక్ట్ చేసిందట . దీంతో దేవుడు అంటే నమ్మకమే లేకుండా పోయిందట .

బాగా మందు తాగేసి దేవదాసులా మారిపోయాడట . సిగరెట్లు కూడా ఎక్కువగా కాల్చేవాడట. అప్పుడు తన ఫ్రెండ్ దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టే నీకు ఇలా జరిగింది ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకో. నీకు ఆయన రిజల్ట్ చూపిస్తాడు అంటూ చెప్పుకొచ్చారట .ఆ సమయంలో నమ్మకం లేకపోయినా సరే రాజశేఖర్ ఫుల్ గా తాగేసి దేవుడు దగ్గరకు వెళ్లి..” ఎస్ నేను తాగుతున్నాను క్షమించండి.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రిజెక్ట్ చేసింది .. ఆ అమ్మాయి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్తే కచ్చితంగా మీరు ఉన్నారని నమ్ముతాను లేదంటే.. రాయి అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చారట . అయితే ఆ తర్వాత మూడు నుంచి 6 నెలల లోపే అమ్మాయి వచ్చి రాజశేఖర్ కు ఐ లవ్ యు చెప్పిందట . అంతేకాదు పోరా రారా అన్న అమ్మాయి ఏవండీ – రండి – పొండి అంటూ అని పిలిచిందని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు రాజశేఖర్ .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news