రాజమౌళి ఎంతో గొప్ప దర్శకుడు.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఆయనదే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో అసలు ఒక్క అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నాడు. బాహుబలి 1, 2, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోయింది. ఆర్‌ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ సాధించుకోవడంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అలాంటి రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నారు.
అయితే కెరీర్‌లో ఎప్పుడు లేనంత తీవ్రమైన ఒత్తిడిలో రాజమౌళి ఉన్నారని.. ఫస్ట్ టైం ఆయనలో కాస్త భయం కూడా ఉందన్న ప్రచారం టాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. రాజమౌళి ఒక్కో సినిమా చేసేందుకు మూడు, నాలుగు ఏళ్ల టైం తీసుకుంటున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్‌లు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. పైగా ఇది రాజమౌళి బ్రాండ్ సినిమా రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అదే ప్రశాంత్‌నీల్ ఒక సినిమా చేసేందుకు రెండేళ్లు టైం మాత్రమే తీసుకుంటున్నాడు. ఈ మూడేళ్లలో కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2, తాజాగా సలార్ సినిమాలతో ప్రశాంత్‌నీల్ రాజమౌళికి బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు.
రాజమౌళి.. ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకుని నాలుగైదు ఏళ్ళు ఒక సినిమా తీసి రూ.1200 కోట్ల వసూళ్లు చేస్తే.. ప్రశాంత్‌నీల్ కేవలం ఇదే టైం లో మూడు సినిమాలు తీసి మూడు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. కేజీఎఫ్ 2.. ఆర్‌ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేయగా.. ఇప్పుడు సలార్ కూడా ఆర్‌ఆర్ఆర్ రికార్డులను తుడిచిపెట్టి దూసుకుపోతుంది. మహేష్ బాబు సినిమా రిలీజ్ కాకుండానే సలార్ 2తో పాటు.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా రిలీజ్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కో సినిమా తెరకెక్కించే విషయంలో రాజమౌళి చాలా స్లోగా ఉంటున్నారు.
అదే ప్రశాంత్ నీల్ చకచక భారీ బడ్జెట్ సినిమాలు తీసి.. పైగా మరీ స్టార్‌డం లేని యష్ లాంటి హీరోలతో కూడా ట్రెండ్ సెట్ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు కూడా భారీ బడ్జెట్‌లు.. భారీ సెట్టింగ్‌లు, భారీ హంగామా లేకుండా రూ.1000 కోట్ల సినిమాలు తీస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు రాజమౌళికి కచ్చితంగా సవాల్ విసురుతున్నాయి. మహేష్ బాబు సినిమాతో మరోసారి బాహుబలి 2 లా ఎవరికి అందని బెంచ్ మార్క్ సెట్ చేయాల్సిన ఒత్తిడి రాజమౌళిపై ఉంది.
అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కెరీర్‌లో ఫస్ట్ టైం చాలా ఒత్తిడికి గురవుతున్నట్టు కూడా తెలుస్తోంది. రాజమౌళి, మహేష్‌బాబు సినిమా బాహుబలి 2 సినిమాను మించిన రేంజ్‌లో వసూళ్లు కొల్లగొడితే మరోసారి రాజమౌళి తాను ఎప్పుడూ ఎవరికి అందనంత ఎత్తులో ఉంటానని ప్రూవ్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ సినిమా కేజీఎఫ్ 2, ఆర్‌ఆర్ఆర్ రేంజ్ కు పరిమితమైతే అప్పుడు లెక్కలు మళ్లీ మారుతాయి అనటంలో సందేహం లేదు.