ఈ మధ్యకాలంలో షో టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి చాలామంది నిర్వాహకులు బోల్డ్ కంటెంట్ ను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ , ఢీ షో లు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను కండక్ట్ చేశారు మేకర్స్ .ఈ క్రమంలోని రష్మీ పెళ్లి పార్టీ అనే పేరుతో ఓ గ్రాండ్ షో కి వెల్కం చెప్పారు .
రీసెంట్గా ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు . చాలా మంచి స్టార్స్ ఈ షోలో పాలొగొన్నట్లు ప్రోమో ఆధారంగా తెలుస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే రష్మీ మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి. ఈ షోలో బుల్లితెర నటీనటులు ..బిగ్ బాస్ సెలబ్రిటీస్ ..బాబా భాస్కర్ .. అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్లు కూడా సందడి చేయడం గమనార్హం .
అలాగే ఎప్పటిలాగే హైపర్ ఆది రషిల మధ్య నవ్వులు పూయించే సంభాషణలు కూడా జరిగాయి . ఆ తర్వాత ప్రోగ్రాంలోకి చమ్మక్ చంద్ర వస్తాడు. దీంతో వెంటనే రష్మీ ఆయన పాదాలను నమస్కరిస్తుంది . ఆ తర్వాత ” ఏంటి రష్మీ నా కాలనీ మొక్కుతున్నావ్ అంటూ నంగిగా అడుగుతాడు చంద్ర ..అప్పుడే రష్మీ బోల్డ్ ఆన్సర్ ఇస్తుంది “. “మగాడు చాలా గొప్పోడు.. ఎంతలా అంటే ఆడపిల్లకు తాళికట్టి భార్యను చేసుకొని .. తన పక్కలో పడుకునే ఛాన్స్ ఇచ్చి ఏడాది తిరిగేసరికి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చేలా చేస్తాడు :అంటూ ఫన్నీగా చెప్పుకొస్తుంది .
వెంటనే బాబా భాస్కర్ పంచ్ వేస్తాడు. అప్పుడే మాట అందుకొని “నీకు మగాళ్లు అంటే గౌరవం అని తెలుసు కానీ ఇంత గౌరవం అని తెలియదు” అంటూ చమ్మక్ చంద్ర అనడంతో..” రష్మీ అయ్యయ్యో నాకు మగాళ్లు అంటే పిచ్చి.. ప్రాణం అండి అంటూ నాటిగా సమాధానం ఇస్తుంది”. దీంతో అక్కడ అందరూ నవ్వులు చిందిస్తారు.
ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 31 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది . అయితే ప్రోమోతోనే ఈ రేంజ్ లో అదరగొట్టారంటే.. స్కిట్లో ఇంకా ఎన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయో అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!