Moviesపూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన హీరో శర్వానంద్..? ఆఖరికి ఆ లక్కి కాఫీ...

పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన హీరో శర్వానంద్..? ఆఖరికి ఆ లక్కి కాఫీ షాప్ ని కూడా అమ్మేశాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . కెరియర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా మరి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఇండస్ట్రీలో ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు .

సినిమాలో ఫ్లాప్ అయినా సరే కుటుంబం మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న పేరు ఉంటుంది . అయితే రీసెంట్గా శర్వానంద్ – రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైపోయాడు. సినిమా షూటింగ్ లు ఉంటేనే ఇండియాకు వస్తున్నాడు . లేకపోతే అక్కడే ఉంటున్నాడు. పైగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. ఇలాంటి మూమెంట్లోని శర్వానంద్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

శర్వానంద్ ఒకానొక టైం లో బాగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట . ఇండస్ట్రీలో ఆయన కమిట్ అయిన ఓ సినీ నిర్మాత రెమ్యూనరేషన్ కింద కోటి రూపాయలు చెక్ ఇచ్చారట . ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మిగతా డబ్బులు ఆ ప్రొడ్యూసర్ శర్వానంద్ కు ఇవ్వలేదట . అయితే ఆ మూమెంట్లో శర్వానంద్ ఫైనాన్షియల్ పరిస్థితి కొంచెం బాగోలేదట. ఎమర్జెన్సీగా ఆయనకు డబ్బులు కావాల్సి వచ్చిందట .

దీంతో ఏం చేయాలో తెలియక ఆ నిర్మాతను చాలా సార్లు ట్రై చేసిన మాట్లాడకుండా ఫోన్ కట్ చేయడం నెంబర్ బ్లాక్ చేయడంతో శర్వానంద్ బాగా హర్ట్ అయ్యాడట. అంతేకాదు ఆ సమయంలో చేసేది ఏమీ లేక అవసరాన్ని తీర్చుకోవడం కోసం తాను ఎంతో ప్రేమతో నిర్మించుకున్న కాఫీ షాప్ ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడట. ఆ తర్వాత శర్వానంద్ నటించిన సినిమా హిట్ అవ్వడం ఆ తర్వాత ఆయనకు డబ్బులు రావడం తాకట్టు పెట్టిన కాఫీ షాప్ ను మళ్ళీ విడిపించుకొని లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news