జనరల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చిన్న సినిమాలు చాలా చాలా దూరంగా .. ఉండే డేట్స్ ని లాక్ చేసుకుంటారు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ కెరియర్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాతోనే సుమ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ బిగ్ బడా హీరో ప్రభాస్ తో పోటీపడ్డాడు . డిసెంబర్ 29న రోషన్ నటించిన బబుల్గం సినిమా రిలీజ్ కాబోతుంది . సుమ కొడుకు తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం .
ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేశారు . అయితే సలార్ సినిమా రిలీజ్ అయిన కేవలం ఏడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోయారు. సలార్ ఎక్కడ.. నువ్వెక్కడ తట్టుకోగలవా ..? కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చుగా అంటూ సలహాలు ఇచ్చారు. అయినా ఎందుకో రోషన్ కనకాల వెనక్కి తగ్గలేదు. అయితే సలార్ మూవీ విజృంభిస్తున్న సమయంలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతూ ఉండడం ఇప్పుడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుంది.
మరోవైపు కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది. బబుల్గం సినిమాకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఇలాంటి మూమెంట్లోనే దర్శకుడు రవికాంత్ మాత్రం సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు . అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”ప్రభాస్ సలార్ చిత్రం విజయం సాధించినందుకు వెరీ వెరీ హ్యాపీ. సలార్ మూవీ థియేటర్స్ లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సలార్ మూవీలో లేని కంటెంట్ మా బాబుల్గంలో ఉంది . సినిమా బాగుంటే ఎన్ని సినిమాలు అయినా ఆదరిస్తారు ఆడియన్స్ అని నేను నమ్ముతున్నాను .. కొత్త నటీనటులతో చేయడానికి ఒక కారణం ఉంది . అది మీరు సినిమా చూశాకే తెలుస్తుంది అంటూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . కొందరు ఆయన కాన్ఫిడెన్స్ ని ఓవర్ అంటుంటే మరి కొందరు గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో..?