Movies"అప్పుడే నా గుండె పగిలిపోయింది" ..సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

“అప్పుడే నా గుండె పగిలిపోయింది” ..సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

హీరోయిన్ సమంత యాక్టింగ్ పరంగా ఎంత తోపు ..ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం విషయంలో కూడా అంతే ధిట్టమైన మనిషి. ఎమోషన్ ఎంత ఉంటుందో ధైర్యం కూడా అంతే ఉంటుంది . అందుకే హీరోయిన్ సమంత అంటే జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. రీసెంట్గా సమంత పెట్టిన పోస్ట్ చాలా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది . గుండె బద్దలై పోతుంది అంటూ ఇన్ స్టా స్టోరీలో పెట్టారు.

ఈ క్రమంలోనే ఆమె పేరు మరోసారి వైరల్ గా మారింది . ఒలంపిక్ రజత పతక విజేత సాక్షి మాలిక్ మాజీ WFI ప్రెసిడెంట్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు మనకు తెలిసిందే. కాగా తనకు న్యాయం చేయాలి అని ఆందోళన చేసిన.. ఆయనను అసోసియేషన్ న్యూ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడాన్ని ఖండిస్తూ ఆమె రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది . ఈ విషయం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోని రీసెంట్గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే చాలా ఎమోషనల్ అయింది. ఆ టైంలో ఏడ్చేసింది కూడా.. ఈ దృశ్యాలు చూసిన ఎవరైనా సరే కన్నీటి పర్యంతం అవ్వక తప్పదు . తన రిటైర్మెంట్ గురించి చెప్పే ముందు సింబాలిక్ గా తన రెస్లింగ్ షూస్ ని టేబుల్ పై పెట్టేసింది. ఈ వీడియో చూసిన సమంత – కాజల్ అగర్వాల్ బాగా హర్ట్ అయ్యారు . బాధ పడిపోయారు. ఈ సన్నివేశం చూస్తుంటే గుండె బద్దలై పోతుంది అంటూ పోస్ట్ పెట్టారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news