Moviesప్రభాస్ ఎంత మంచోడు అంటే.. ఇది చదవండి మీకే తెలుస్తుంది.. కాళ్లకి...

ప్రభాస్ ఎంత మంచోడు అంటే.. ఇది చదవండి మీకే తెలుస్తుంది.. కాళ్లకి దండం పెట్టెస్తారు అంతే..!

ప్రభాస్ .. ఎంత మంచోడో అంత డేంజరస్ ఫెలో . మంచి విషయంలో మహాముదురు. ఎదుట వాళ్లు ఎవరైనా ఎలాంటి వారైనా సరే అడిగితే కోట్లయినా ఖర్చు పెట్టేస్తాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా ఓ ఇన్సిడెంట్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు పృథ్వీరాజ్ . మలయాళీ నటుడు పృథ్వీరాజ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా సలార్ . డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేకాదు సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. 450 కోట్ల రూపాయల భారీ యాక్షన్ ధ్రిలర్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ చేస్తుంది . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ కు ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడమంటూ ఛాన్స్ వచ్చింది. దీంతో ప్రభాస్ ఒరిజినల్ క్యారెక్టర్ ను బయటపెట్టారు . “ప్రభాస్ చాలా డేంజరస్ .. ఫుడ్ విషయంలో అస్సలు మనం తట్టుకోలేం ..ఆయనతో ఉంటే డైట్ అనేది అసలు పాటించలేం”.

“ఒకసారి నా భార్య కుమార్తతో షూటింగ్ కి వస్తే గదినిండా వంటకాలతో నింపేశాడు . అంతేకాదు ఓ రోజు షూటింగ్లో కార్లు అంటే ఇష్టమని చెప్పాను.. అంతే ఆయనకు ఎంతో ఫేవరెట్ అయిన 6 కోట్ల విలువ చేసే తన లొంబోర్గి కారుని నాకు ఇచ్చేశాడు . హైదరాబాదులో నువ్వు ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నా కారు వాడుకో అంటూ నా చేతిలో కీస్ పెట్టారు . ప్రభాస్ ప్రేమను తట్టుకోలేం ..అందుకే ఆయన అందరూ డార్లింగ్ అవుతాడు ” అంటూ పృథ్వీరాజ్ చెప్పుకు వచ్చాడు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news