ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఆమె స్టేటస్ – రేంజ్ కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది . ఒకప్పుడు లావణ్య త్రిపాఠి అంటే అందంగా ఉంటుంది ..బాగా నటిస్తుంది . ఆమె కూడా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి అంటే ఇండస్ట్రీలో ఎంతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు .
ఇది కూడా ఇప్పుడు యాడ్ అయింది కాగా మెగా ఫ్యామిలీ అంతటికి లావణ్య త్రిపాఠి బాగా నచ్చేసింది. మరీ ముఖ్యంగా తోటి కోడలు ఉపాసనకు బన్నీ భార్య స్నేహారెడ్డి కు మంచి ఫ్రెండ్ అయిపోయింది . కాగా మెగా కోడలుగా పేరు సంపాదించుకున్న సురేఖ – ఉపాసన – లావణ్య త్రిపాఠిలో ఉండే కామన్ క్వాలిటీ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు.
అదే జాలి గుణం . సురేఖకు ఎంత జాలి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కష్టంలో ఉన్న వాళ్ళు సహాయం చేయండి అని అడగకపోయినా సరే ఆమె వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మరి సహాయం చేస్తుంది. అది డబ్బు – బట్టలు – ఆహారం ఏదైనా సరే ఉపాసన గురించి అస్సలు చెప్పనవసరం లేదు . ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది . లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికి ముందు నుంచే ఎక్కువగా ప్రజా సేవ చేస్తూ ఉండేది . అన్నదానం చేయిస్తూ ఉండేది తన దగ్గర ఉన్న డబ్బుల్లో తోచినంత పేద ప్రజలకు ఖర్చు చేసేది . ఇలా ప్రజాసేవ దానం చేయడంలో ఈ ముగ్గురు మెగా కోడలు టాప్ ప్లేస్ లో ఉన్నారు..!!