దర్శకుడు బాపు స్టయిలే వేరు. ఆయన ప్రయత్నాలు… తీసే సినిమాల పరిస్థితే వేరు. ముత్యాల ముగ్గు సినిమా చేస్తున్నప్పుడు.. ఈ సినిమా ఫట్టే.. అన్నవారే.. ఒకటికి రెండు సార్లు చూశారు. అలాంటి దర్శకుడు బాపు. తర్వాత తరంలో కూడా ఎన్నోహాస్య, సామాజిక సందేశాలతో కూడిన సినిమాలనుతెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే.. బాపు వెంటే ఉండే రైటర్ రమణ. వీరిద్దరూ కూడా ఎక్కడా రాజీ పడేవారు. దీంతో సినిమాలు చక్కగా పండేవనే టాక్ ఉంది.
రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన పెళ్లిపుస్తకం సినిమా కు బాపు దర్శకులు. రైటర్ రమణగారు. అయితే.. ఈ సినిమా స్లోగా ప్రారంభమై.. ఎక్కువ గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఒక గమ్మత్తు జరిగింది. బాపు పట్టుదలతో చేసిన ఒక సీన్.. కోసం..రోజు రోజంతా షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది. అదే.. స్క్రిప్టులో రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకోవడం.
రమణ గారు ఇలానే రాశారు. షాట్స్ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి బాదం ఆకుల విస్తర్లు కావాలని ప్రొడక్షన్ వాళ్లకి రాసి ఇచ్చారు. షూటింగ్ హైదరాబాద్‌లో ఉదయం 7కే ప్రారంభమైంది. అయి తే.. ప్రొడక్షన్ వాళ్లు మాత్రం బాదం ఆకులు దొరకలేదని, మామూలు విస్తరాకులు తెచ్చారు. దీంతో బాపు ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంతపెద్ద హైదరాబాద్‌లో బాదం చెట్టు లేదా? అని కసురుకున్నారు. ఆకులు తెచ్చే వరకు షూటింగ్ లేదని తెల్చిచెప్పేశారు..
దీంతో రెండు కార్లు వేసుకుని హైదరాబాద్ మొత్తం చుట్టేశారు. ఆఖరికి చిక్కడపల్లిలో బాదం చెట్టు ఉందని తెలిసి.. వెళ్లి ఆకులు కోసి తెచ్చి, విస్తర్లు కుట్టేసరికి మధ్యాహ్నం అయింది. అయితేనేం అనుకున్న ఆకులు వచ్చాయి. దీంతో మళ్లీ ఇడ్లీలు తెప్పించి, సీను షూట్ చేశారు. చిత్రం ఏంటంటే.. ఇంత కష్టపడి చేసిన ఈ సీన్.. ఎడిటింగ్‌లో కకట్ చేశారు.. ఇదే విషయాన్ని చెబుతూ. రమణగారు.. ఆ ఒక్క సీన్ కోసం.. 10వేలు ఖర్చయిందని, కానీ కట్ అయిందని వ్యంగ్యోక్తులు రువ్వారు.