ఎస్ సలార్ అనేది ప్రభాస్ సినిమాయో… ప్రభాస్ అభిమానుల సినియానో కాదు.. ఇది ప్రతి తెలుగోడి సినిమా. ఈ సినిమాకు కన్నడ నిర్మాతలు, కన్నడ దర్శకుడు, కన్నడ టెక్నీషియన్లే పని చేసి ఉండొచ్చు.. ఇది తెలుగు నిర్మాత సినిమా కాకపోయి ఉండొచ్చు.. కానీ హీరో మన తెలుగోడు ప్రభాస్. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ నేషనల్ వైడ్‌గా ఎలా పాపులర్ అయ్యిందో చూశాం. బాహుబలి 1, 2 దెబ్బతో నార్త్.. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోల మైండ్ పోయింది. అసలు ఈ ప్రభాస్ ఎక్కడోడు.. ఈ వసూళ్లు ఏంటని ముక్కున వేలేసుకున్నారు.
అప్పటి నుంచి తెలుగు సినిమా అంటే ఇటు తమిళంతో పాటు అటు నార్త్ వాళ్లు కూడా కుళ్లుకోవడం మొదలు పెట్టారు. సాహో ప్లాప్ అన్నా కూడా బాలీవుడ్‌లోనే రు. 150కు పైగా కోట్లు రాబట్టి వాళ్లకు మతులు పోయేలా చేసింది. రాధేశ్యామ్ డిజాస్టర్. ఆదిపురుష్ యావరేజ్ అయినా బాలీవుడ్‌లో మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ వర్సెస్ షారుక్ ఖాన్ ఢంకీ సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదు.
హిట్ అనేది ఎప్పుడో మర్చిపోయి సూపర్‌స్టార్ హోదా రద్దు చేయాలన్న విమర్శలు ఎదుర్కొన్న షారుక్‌కు ఈ యేడాది వరుసగా రెండు హిట్లు పడ్డాయి. ఒకటి పఠాన్, రెండోది జవాన్. జవాన్‌కు మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఈ యేడాది షారుక్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఢంకీ. సలార్, ఢంకీ ఒక్క రోజు తేడాలో రిలీజ్ అవుతున్నాయి. షారుక్ సినిమా ఒక్క రోజు ముందు వస్తోంది. సలార్ ట్రైలర్ల దెబ్బతో బాలీవుడ్ మొత్తం బెంబేలు ఎత్తుతోంది.
సలార్ ముందు ఢంకీ కాస్త అటూ ఇటూ అయితే పరువు పోతోందని భయపడుతోంది. అందుకే ఇప్పుడు సలార్‌కు రిలీజ్‌కు ముందే నెగటివ్ ప్రచారం చేసే పనిలో బిజీగా ఉంది. ఢంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. సలార్‌కు పాక్షికంగా స్టార్ట్ అయ్యాయి. సలార్కు ఇంకా ఏపీ, తెలంగాణలో బుకింగ్‌లు మొదలు కాలేదు. దీంతో బాలీవుడ్ మీడియా రెండు సినిమాలకు అమ్ముడైన టిక్కెట్లు, వచ్చిన వసూళ్ల మధ్య కంపేరిజన్లు చేస్తూ ఢంకీ ముందు సలార్ తేలిపోతోందని నెగటివ్ ప్రచారం మొదలు పెట్టేసింది.
సలార్‌కు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌లతో కేవలం మూడున్నర కోట్లు వస్తే… ఢంకీకి నాలుగున్నర కోట్లు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియా తెగ ఊదరగొట్టేస్తుంది. అయితే ఏపీ, తెలంగాణ సలార్ బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. అవి కూడా ఓపెన్ అయితే సలార్ విధ్వంసం ముందు ఢంకీ బేజారవుతుంది. ఇది బాలీవుడ్ మీడియాకు తెలియింది కాదు.. అయితే ప్రస్తుతానికి శునకానందం పొందుతున్నారు.
అటు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సలార్ జోరు ముందు ఢంకీ బేజారవుతోంది. ఈ యేడాది రిలీజ్ అయిన సినిమాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగా సలార్ రికార్డుల్లోకి ఎక్కింది. షారుక్ చాలా యేళ్ల తర్వాత ఈ యేడాది రెండు వరుస సూపర్ హిట్లతో ఉన్నాడు కాబట్టి సహజంగానే అతడి నెక్ట్స్ సినిమాపై కాస్త ఆసక్తి సహజం. అందుకే నార్త్ బెల్ట్‌లో ఢంకీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సలార్‌పై క్రేజ్ ఢంకీతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది.
దీనినే బాలీవుడ్ మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. ఈ టైంలో తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరు కూడా హీరోలు, అభిమానులు, గ్రూపులకు అతీతంగా సలార్‌కు సపోర్ట్ చేసి తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో గొప్పగా నిలబెట్టుకోవాలి. అలాగే తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియా కూడా బాలీవుడ్ మీడియా ఎలా అయితే ఆ సినిమాకు సపోర్ట్ చేస్తుందో ఇక్కడ కూడా మీడియా ఒకే తాటిమీదకు రావాలి.