ఎస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. అల్లు అరవింద్ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు అల్లు అర్జున్ గురించి అరవింద్ ఆలోచన చేయడానికి ఏం లేదు. బన్నీ ఐకాన్‌స్టార్ అయిపోయాడు. పుష్ప దెబ్బతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు బన్నీ సినిమా వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉండనున్నాయి.
ఇక రెండో కుమారుడు శిరీష్ కెరీర్‌పై అరవింద్ కాన్సంట్రేషన్ చేయొచ్చు. తనతో పాటు గీతా ఆర్ట్స్ 2 వ్యవహారాలు చూస్తోన్న బన్నీ వాస్ లాంటి వాళ్ల చేతుల్లో పెడితే మంచి కథలు, యువ దర్శకుల కాంబినేషన్లు సెట్ చేసి.. మీడియం బడ్జెట్ సినిమాలు చేసి హిట్లు తీయొచ్చు. ఈ పాటికే అలా చేసి ఉంటే శిరీష్ కూడా హీరోగా నిలదొక్కుకుని ఉండేవాడు. కానీ అరవింద్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేసినట్టు కనపడడం లేదు.
దీంతో పాటు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ కలిసి శిరీష్ .. అల్లు ఫ్యామిలీకి దూరంగా కొద్ది రోజులు ముంబైలో ఉన్నాడన్న ప్రచారం కూడా నడిచింది. అసలు శిరీష్‌కు సినిమాల మీద ఆసక్తి ఉందా ? అంటే అది కూడా డౌట్‌గానే కనిపిస్తోంది. అల్లు శిరీష్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఊర్వశివో రాక్షసివో తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు. టెడ్డీ సినిమా షూటింగ్ పూర్తయినా దీనిమీద అప్డేట్ లేదు.
ఇక లోకేష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇది టైమ్ ట్రావెల్ జోనర్లో సాగే స్టోరీ కాగా…. ఈ సినిమాకి ‘నిన్న – నేను – రేపు’ అనే టైటిల్ పెట్టారట. ఇలా కొత్త కథలు చేసే టైంలో అయినా అరవిందో లేదా బన్నీ వాస్ నో లేదా కనీసం అన్న అల్లు అర్జున్ తన బ్యాక్ ఎండ్ టీంతోనే కోపరేట్ చేస్తే శిరీష్‌కు ఇబ్బంది ఉండదు.
అసలు శిరీష్‌ను ఎవ్వరూ పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసిన వాతావరణమే కనిపిస్తోంది. దీంతో శిరీష్ సినీ కెరీర్, గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఏదేమైనా ఓ పెద్ద నిర్మాత కుమారుడు, అన్నీ హంగులు ఉండి ఇలా రేసులో వెనకపడిపోవడం సరైంది కాదన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.