ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సిన సినిమాను కార్తీకేయ హీరోగా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఆ సినిమా మరేదో కాదు ఆర్ఎక్స్ 100 .
అప్పటికి అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ కి ఆర్ఎక్స్ 100 కధను వినిపించారట డైరెక్టర్ అజయ్ భూపతి . అయితే కథ బాగా నచ్చిన కూడా ఆయన ఈ సినిమా రిజెక్ట్ చేశారట. దానికి కారణం అర్జున్ రెడ్డి మొత్తం క్లాస్ బ్యాక్ గ్రౌడ్ లో తెరకెక్కుతుంది . సిటీలో పెరిగిన విజయ్ దేవరకొండకు ఆ లుక్స్ బాగా నచ్చుతాయి .
ఆర్ఎక్స్ 100 సినిమా అంటే విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంది. పెద్దగా ఆయనకు సెట్ అవ్వవు . అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథను పలువురు టాలీవుడ్ హీరోలకి చెప్పిన పెద్దగా లైక్ చేయకపోవడంతో ఫైనల్లి కార్తికేయతో తెరకెక్కించాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా కార్తికేయకు మంచిగా అవకాశాలు దక్కించుకునే ఛాన్సెస్ కూడా వచ్చేలా చేసింది..!!