News2023లో ఫ్యాన్స్ ని బాధపెట్టి ..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన స్టార్స్ వీళ్ళే..!

2023లో ఫ్యాన్స్ ని బాధపెట్టి ..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన స్టార్స్ వీళ్ళే..!

2023 మరో 15 రోజుల్లో కంప్లీట్ కాబోతుంది. ఈ క్రమంలోనే అందరూ జనాలు 2023లో జరిగిన తీపి సంఘటనలను చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఊహించిన విధంగా 2023లో అత్యధిక మంది స్టార్ సెలబ్రిటీస్ మరణించి ఫ్యాన్స్ ను బాధపెట్టారు. వాళ్ళు ఎవరో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

తారకరత్న : నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఈ తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ గుండెపోటు కారణంగా నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ చనిపోయారు . ఆయన మరణాన్ని నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు .

జమున: సీనియర్ నటి జమున జనవరి 27న వయసు పై పడటంతో అనారోగ్య సమస్యలు కారణంగా చనిపోయారు . ఇండస్ట్రీకి జమున అందించిన సేవలు ఇప్పటికీ మర్చిపోలేనివి.

కే విశ్వనాథ్: ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో చెరగని రికార్డులను క్రియేట్ చేసి పెట్టిన విశ్వనాధ్ గారు అనారోగ్య సమస్యలు కారణంగా ఫిబ్రవరి 2వ తేదీ తుదిశ్వాస విడిచారు.

రాకేష్ మాస్టర్: తక్కువ టైంలోనే స్టార్ పబ్లిసిటీ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్య కారణంగా సడన్గా జూన్ 18న చనిపోయారు . ఆయన మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .

శరత్ బాబు : హీరోగా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ..విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించిన శరత్ బాబు మే 22న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారు.

చంద్రమోహన్ : ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ ఈ ఏడాది నవంబర్ 12న చనిపోయారు. ఈయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఇలా చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఈ సంవత్సరంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news