టాలీవుడ్‌లో మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ యేడాది కూడా భారీగానే సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీతో పాటు వెంకటేష్‌తో పాటు కొందరు హీరోల సినిమాలు ఈ యేడాది థియేటర్లలోకి రాలేదు. అయితే సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య మాత్రం రెండేసి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ యేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రు. 100 కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.
1- వాల్తేరు వీరయ్య :
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ మల్టీస్టారర్‌గా బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో శృతీహాసన్, కేథరిన్ హీరోయిన్లు. రు. 227 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సినిమా కొల్లగొట్టింది.
2- ఆదిపురుష్ :
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్, కృతిసనన్ జంటగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. జూలై 16న రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా రు. 184 కోట్ల వసూళ్లు రాబట్టింది.
3- వీరసింహారెడ్డి :
నటసింహం బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర గర్జించాడు. ఈ సినిమాలోనూ శృతీహాసన్ హీరోయిన్. తొలిరోజే ఏకంగా రు. 54 కోట్లు రాబట్టిన ఈ సినిమా రు. 140 – 145 కోట్ల రేంజ్‌లో వసూళ్లు రాబట్టింది.
4- భగవంత్ కేసరి :
ఇక ఎనిమిది నెలల గ్యాప్‌లో బాలయ్య భగవంత్ కేసరిగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించాడు. అనిల్ రావిపూడికి ఇది వరుసగా ఏడో సినిమా. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా రు. 140 కోట్లు కొల్లగొట్టింది.
5 – దసరా :
నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా కూడా రు. 117 కోట్లు రాబట్టింది. నాని కెరీర్‌లో ఇది ఫస్ట్ రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది.
6- బ్రో :
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమా కూడా జూలై 28న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా రు. 110 కోట్లు రాబట్టినా ఓవరాల్‌గా సినిమా అంచనాలు అందుకోలేదు.