సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హీరోయిన్ల పెళ్లిల్లే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఓ యువ ఎమ్మెల్యే పెళ్లి సందడి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం మెహ్రిన్. ఎస్ ఒకప్పుడు హీరోయిన్ మెహ్రీన్ తో నిశ్చితార్థం చేసుకున్న బిజెపి యువ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఆ తర్వాత ఆ నిశ్చితార్ధాని బ్రేకప్ చెప్పుకున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ గ్రాండ్గా వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన భవ్య బిష్ణోయ్ ఆ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నారు.
అయితే ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారినితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు వాళ్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . వీళ్లకి సంబంధించిన మరో న్యూస్ హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈనెల 22న బిజెపి యువ ఎమ్మెల్యే వివాహం జరగబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు వీరి పెళ్లిని ఇప్పటివరకు ఎవరు చేయని రేంజ్ లో చేయబోతున్నారట కుటుంబ సభ్యులు .
వీరి పెండ్లి రిసెప్షన్ కు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరు కాబోతున్నారట . వీరంతా వీఐపీలు అనుకుంటారేమో కానేకాదు వీళ్లల్లో సగానికి పైగా జనాలు సామాన్య జనాలే. ఈనెల 22న రాజస్థాన్లోని ఉదయ్ పూర్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది . 24న పుష్కర్లు మొదటి రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి 50,000 మంది వరకు హాజరు కాబోతున్నారట . అలాగే డిసెంబర్ 27న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది ఈ వేడుకకు ఏకంగా 3500 మంది హాజరు కాబోతున్నారట . వీళ్ల పెళ్లి కోసం కోట్లు నీళ్లు లా ఖర్చు చేస్తున్నారట.ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!