సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఎన్నెన్నో అవార్డులను తీసుకొస్తున్నారు . చాలామంది 10 – 14 భాషలు అవలీలగా మాట్లాడేస్తున్నారు . అయితే అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు ..? వాళ్లు హీరోలు కాకుండా ఉంటే ఏమై ఉండేవారు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
మెగాస్టార్ చిరంజీవి : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కొణిదెల హీరో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు . డిగ్రీలో కామర్స్ చేసిన చిరు నర్సాపూర్ వై ఎన్ కాలేజీలో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు . ఒకవేళ చిరంజీవి హీరోగా కాకపోయి ఉంటే మాత్రం ఆయన కచ్చితంగా లెక్చరర్ అయ్యుండేవారట.
నాగార్జున : కింగ్ గా నవమన్మధుడుగా ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న అక్కినేని నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. అమెరికాలోని ఈస్టర్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు కంప్లీట్ చేసి తర్వాత ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి నాగార్జునకు బిజినెస్ అంటే చాలా ఇష్టమట. అందుకే సినిమాలో హీరోగా చేస్తున్న కూడా బిజినెస్ వైపు ఎక్కువగా ముందుకు వెళ్తున్నారు .
వెంకటేష్: ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఎంబీఏ పూర్తి చేశారు . మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను అమెరికాలోని మోంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో కంప్లీట్ చేశారు. ఒకవేళ వెంకటేష్ హీరో కాకపోయి ఉంటే మాత్రం ఆయన బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయిపోయిండే వాడట .
బాలకృష్ణ : నందమూరి నటసిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. నిజాం కాలేజ్ హైదరాబాద్లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ మొదటి నుంచి హీరో అవ్వాలని పక్కాగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి కంటే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నారు. చదువులో మాత్రం కాస్త వెనకడుగు వేశారు .ఇంటర్మీడియట్ వరకే చదువుకొని ఆపేశారు . అంజనా ప్రొడక్షన్ హౌస్ లో సహా నిర్మాతగా వ్యవహరించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హీరో కాకపోయి ఉంటే మాత్రం చేతికి వచ్చిన జాబ్ ఏదో ఒకటి చేసుకుని ప్రజాసేవ చేయాలని ఫిక్స్ అయిపోయాడట .
మహేష్ బాబు : సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు చెన్నై లయోలా కాలేజీలో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. మహేష్ చదువు మొత్తం చెన్నైలోనే జరిగింది . చెన్నైలోనే పూర్తయింది . ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు . అయితే మహేష్ బాబుకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కన్నా బిజినెస్ లో రానివ్వడమే చాలా ఇష్టమట .
ప్రభాస్ : రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశాడు. బిటెక్ పూర్తి చేసిన తర్వాత ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు . నిజానికి సినిమాలోకి రావడం కన్నా ప్రభాస్ కి బిజినెస్ వైపు ఎక్కువగా వెళ్లాలని ఆసక్తి ఉందట .
ఎన్టీఆర్ : యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా చదువుకోలేదు . ఆయన ఇంటర్మీడియట్ ని సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాదులో పూర్తి చేశారు .చదువుకుంటున్న టైం లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు . కానీ ఎన్టీఆర్ మాత్రం అన్ని భాషలు అవలీలగా మాట్లాడగలడు . ఎన్టీఆర్ లో చాలా హీడన్ టాలెంట్స్ ఉన్నాయి. ఎలాంటి వారినైనా మిమిక్రీ చేసి మెప్పిస్తారు . అంతేకాదు డాన్స్ యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ . ఎన్టీఆర్ ముందు నుంచి హీరో అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే బలంగా నమ్మిన దానిపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు..!!