Newsఆ సెంటిమెంట్లు నిజమైతే మాత్రం గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్... చ‌ర‌ణ్...

ఆ సెంటిమెంట్లు నిజమైతే మాత్రం గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్… చ‌ర‌ణ్ చేసేదేం లేదా…!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నమ్మినా నమ్మకపోయినా సెంటిమెంట్లు చాలా సందర్భాల్లో నిజమవుతూ ఉంటాయి. రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఇప్పటికీ బ్రేక్ కాలేదు. ఆచార్య సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని చెప్పినా ఆయన నమ్మకం కూడా నిజం కాకపోవడం అభిమానులకు షాకిచ్చింది.

అదే విధంగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను కొన్ని సెంటిమెంట్లు భయపెడుతున్నాయి. తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలతో చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. ఎస్.జె సూర్య పవన్ కాంబోలో తెరకెక్కిన కొమురం పులి, మహేష్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన స్పైడర్, చైతన్య వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

రామ్ లింగుస్వామి కాంబోలో తెరకెక్కిన ది వారియర్ సైతం నష్టాలను మిగిల్చింది. చరణ్ శంకర్ కాంబోను సైతం ఈ సెంటిమెంట్ భయపెడుతోంది. మరోవైపు చరణ్ మూడో సినిమా ఆరెంజ్, ఆరో సినిమా తుఫాన్, తొమ్మిదో సినిమా బ్రూస్ లీ, పన్నెండెవ సినిమా వినయ విధేయ రామ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. 3, 6, 9, 12వ సినిమాలు చరణ్ కు భారీ షాకిచ్చిన నేపథ్యంలో 15వ సినిమా విషయంలో సైతం అభిమానులకు టెన్షన్ నెలకొంది.

రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోలకు కొంతకాలం పాటు సరైన సక్సెస్ దక్కదనే సెంటిమెంట్ కూడా ఉంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్లకు గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి కాగా 2024లోనే ఈ సినిమా రిలీజ్ కానుందని క్లారిటీ వచ్చింది. గేమ్ ఛేంజర్ కళ్లు చెదిరే రికార్డులను సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news